మానవులు ఏదో ఒక సందర్భంలో పొరపాట్లు చేయడం అనేది కామన్.కానీ కొందరు చేసే తప్పులు చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది.
ఎందుకంటే అలాంటి పొరపాట్లు దాదాపు ఎవరూ చేయరు.కొందరు మాత్రం అలాంటి పిచ్చి పనులు చేసి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తుంటారు.
తాజాగా ఒక మహిళ, వంట చేస్తున్నప్పుడు, పొరపాటున తన యాపిల్ ఐప్యాడ్‌ను( Apple iPad ) ఓవెన్‌లో ఉంచింది, కట్ చేస్తే అది ఉపయోగించడానికి వీలు లేకుండా మాడిపోయింది.ఈ అసాధారణ సంఘటన గురించి రెడిట్‌లో ఒక యూజర్ తెలియజేశాడు.
దీనికి 30,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.
కొందరు నవ్వుకున్నారు.కొందరు పరిస్థితి గురించి చమత్కరించారు, మరికొందరు మహిళ భద్రత గురించి ఆందోళన చెందారు.

కొందరు యూజర్లు సేఫ్టీ అంశంపై దృష్టి సారించారు, పాడైపోయిన ఐప్యాడ్ నుంచి రసాయనాలు విడుదలై ఉండొచ్చని దీనివల్ల, ఓవెన్‌ని మళ్లీ ఉపయోగించే ముందు పూర్తిగా శుభ్రం చేయాలని సూచించారు.మహిళ ఓవెన్‌ను ( Woman oven )సరిగ్గా శానిటైజ్ చేసే వరకు ఉపయోగించకూడదని కూడా వారు సిఫార్సు చేశారు.ఐప్యాడ్ బ్యాటరీ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని ఒకరు కామెంట్ చేశారు.బ్యాటరీ ( Battery )వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నందున పాడైపోయిన పరికరాన్ని సురక్షితంగా పారవేయాలని వారు సూచించారు.

ఈ సంఘటన చాలా మందిని కలవరపెడుతుంది, ఇలాంటి తప్పు ఎలా జరుగుతుంది అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు.ఐప్యాడ్ ఓవెన్‌లో ఎలా వేశారు ముందు నుంచి చెప్పాలంటూ మరి కొంతమంది కోరారు.మొత్తంమీద, ఈ ఘటన చాలామందిని విస్తుపోయేలా చేసింది.







