త్యాగానికి ఫలితం దక్కబోతోందా ? వంగవీటి కి ఆ పదవి ? 

కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తప్పకుండా సరైన న్యాయం చేస్తామనే సంకేతాలను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పంపిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసి న నేతలందరికీ ఏదో ఒక పదవి కట్టబెట్టి, పార్టీని నమ్ముకున్న వారికి తగిన న్యాయం జరుగుతుందనే సంకేతాలు పంపించాలని నిర్ణయించుకున్నారు.

దీనిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణకు( Vangaveeti Radhakrishna ) మరికొద్ది రోజుల్లోనే కీలక పదవి దక్కబోతున్నట్లు సమాచారం.త్వరలో చట్టసభలకు ఆయనను ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.

ఎమ్మెల్సీగా ( MLC ) ఆయన పేరును తొలి జాబితాలోనే చంద్రబాబు చేర్చనున్నారట.

ఈ మేరకు రాధాకృష్ణ కూడా దీనిపై సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.రాధాకృష్ణ పార్టీనే నమ్ముకుని ఉండడం, వైసీపీలో( YCP ) చేరాల్సిందిగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా రాధాకృష్ణ పార్టీ మారకపోవడం, ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోయినా, కూటమి అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేయడం, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం తదితర కారణాలతో రాధాకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా రాధాకృష్ణ గెలిచారు.ఆ తరువాత నుంచి వివిధ పార్టీల్లో చేరిన ఆయనకు ఓటమే ఎదురవడం, 2019 - 2024 ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కకపోయినా, పార్టీలోనే ఉండడం, అమరావతి రైతుల ఉద్యమానికి అండగా నిలబడడం వంటివన్నీ చంద్రబాబు గుర్తించారు.

Advertisement

వైసీపీలోని రాధాకృష్ణ స్నేహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని పార్టీ మారాలని ఎంత ఒత్తిడి చేసినా రాధాకృష్ణ టిడిపిలోనే ఉండడం ఇవన్నీ ఆయనకు కలిసి రాబోతున్నాయి.ప్రస్తుతం అసెంబ్లీలో టిడిపికి తిరుగులేని మెజారిటీ ఉంది.దీంతో ఏ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా అది కూటమి ఖాతాలోకి వస్తుంది.

పోటీ ఉండదు.ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.

అందుకే శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమికి ఖాతాలోకే వస్తుండడంతో మొదటగా ఖాళీ ఎమ్మెల్సీ స్థానంలో రాధాకృష్ణకు చంద్రబాబు అవకాశం ఇవ్వబోతున్నారట.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు