స్వచ్చత.. పరిశుభ్రత పాటించాలి చందుర్తి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాకాలం సీజన్ దృష్యా వసతి గృహాల్లో స్వచ్చత.

పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha) ఆదేశించారు.

చందుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాస్టల్ లోని స్టోర్ రూం, టాయిలెట్స్, కిచెన్, గదులు, రిజిస్టర్లు పరిశీలించారు.

మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారని డీఎస్ సీడీఓ విజయ లక్ష్మిని అడుగగా, 35 మంది విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ రోజు ఉదయం ఏమి టిఫిన్ పెట్టారని తెలుసుకోగా, అటుకులు, సేమియా ఇచ్చామని చెప్పారు.

సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మ్యాథ్స్ చేయించి.

Advertisement

ఇంగ్లీష్ చదివించిఅనంతరం కలెక్టర్ చందుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల( Govt Primary School )ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మ్యాథ్స్ సమస్యలను పరిష్కరింపజేశారు.

ఇంగ్లీష్ లెసన్స్ చదివించారు.పిల్లలు రాయడం, చదవడం, సమస్యల పరిష్కారంలో ముందు ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అదే ఆవరణలోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు.ఇక్కడ డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కబ్జాలకు పాల్పడుతున్న వోటకరి భూమేష్ అరెస్ట్ ,రిమాండ్ కి తరలింపు..
Advertisement

Latest Rajanna Sircilla News