Junior ntr political entry: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పబ్లిక్ ఏమంటున్నారో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే ప్రశ్న భేతాళ ప్రశ్నగా ఉంది.తారక్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కొంతమంది మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ను అందరూ గౌరవించాలని కోరిక అని పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని వాళ్లు తెలిపించారు.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే టీడీపీకి మేలు జరుగుతుందని ఒక మహిళ అభిప్రాయం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ వారసత్వ పార్టీ కాదని నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీతో ఉన్నారని ఉంటారని ఒక వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ కళాకారుడు మాత్రమే కాదని ఆయన ప్రజల కష్టాలు తీర్చి అభిమానాన్ని చూరగొన్న మనిషి అని కామెంట్లు చేయడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ తెలుగుజాతి గర్వించే నాయకుడని ఒక వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Clarity About Young Tiger Junior Ntr Political Entry Details, Ntr, Junior Ntr Po
Advertisement
Clarity About Young Tiger Junior Ntr Political Entry Details, Ntr, Junior Ntr Po

గతంలో పలు సందర్భాల్లో ఫ్యాన్స్ సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి.త్వరలో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమాల్లో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో తారక్ రాజకీయాలకు దూరంగా ఉండాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Clarity About Young Tiger Junior Ntr Political Entry Details, Ntr, Junior Ntr Po

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలు కానుండగా ఈ సినిమా తారక్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుస సక్సెస్ లు తారక్ రేంజ్ ను మార్చాయని కొత్త ప్రాజెక్ట్ లు కూడా ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉంటే తారక్ మార్కెట్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు