మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు.
ప్రెజెంట్ అయితే చరణ్ లైనప్ ఇంట్రెస్టింట్ దర్శకులతో సాగుతుంది.
ఈయన లైనప్ లో ఉన్న ఫస్ట్ డైరెక్టర్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్.శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.
ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ శంకర్ గురించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.శంకర్ వర్క్ కు 1992 నుండే పెద్ద ఫ్యాన్ అని ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకు డ్రీమ్ లాంటిది అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే క్రమంలో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం త్వరలోనే న్యూయార్క్ వెళుతున్నట్టు కన్ఫర్మ్ చేసేసాడు.అక్కడే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీమ్ అంతా బయలు దేరుతున్నట్టు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.