బదిలీపై వెళ్తున్న పట్టణ సీఐ ఓ, వెంకటేష్ కు ఘన సత్కారం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో శాంతి భద్రతలను కాపాడటంలో తనదైన ముద్ర వేసుకున్న పట్టణ సీఐ ఓ, వెంకటేష్( CI O, Venkatesh ) బదిలీపై వెళ్తుండడంతో నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు గజమాలలతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

పోలీస్ శాఖలో సిఐ వెంకటేష్ బాధ్యత యుతంగా ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి అమూల్యమైన సేవలను వారు కొనియాడారు.

రాబోయే రోజుల్లో వేములవాడ( Vemulawada ) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నతమైన పదవులను చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆశించారు.అనంతరం బదిలీపై పట్టణానికి వచ్చినటువంటి నూతన సీఐ కరుణాకర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దయ్యాల సుకుమార్, న్యాత నవీన్, జింక శ్రీధర్, చింతలపల్లి సంతోష్, యూసుఫ్, రిక్కీ, రమేష్, హేమంత్, మరియు 50 మంది యువకులు తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News