శ్రీరస్తు శుభమస్తుకు చిరు స్పెషల్ ఎట్రాక్షన్..!

మెగా సపోర్ట్ తో అల్లు హీరోల హవా ఎలా కొనసాగిస్తునారో అల్లు అర్జున్ సినిమాల కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక అల్లు, మెగా ఫ్యామిలీల అనుబంధం ఈనాటిది కాదు పేరుకు అల్లు ఇంటిపేరైనా సరే అల్లు అర్జున్, శిరీష్ లు కూడా మెగా హీరోలనే అంటుంటారు.

ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా అల్లు సినిమా అయినా దానికి మెగా సపోర్ట్ భారీ రేంజ్ లో ఉంటుంది.ప్రస్తుతం అల్లు శిరీష్ తన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అయితే సినిమా ఆడియో వేడుక చేయకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసిన చిత్రయూనిట్.సరైనోడు సినిమా ప్లాన్లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి ప్లాన్ చేశారు.

ఇక సినిమాకు ప్రమోషన్ తో పాటుగా సినిమా హిట్ కళ తెచ్చేందుకు కొత్త ప్రయత్నంగా చేస్తున్న ఈ అల్లు హీరో సినిమా ఫంక్షన్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.మెగా హీరోలుగా కీర్తించబడుతున్న ఏ హీరో సినిమా అయినా సరే తన సపోర్ట్ ఇచ్చేందుకు ముందుండే చిరు అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమా కోసం కదలి రానున్నాడు.

Advertisement

మరి ఈ హంగామా అంతా చూస్తుంటే అల్లు శిరీష్ ఈసారి హిట్ కొట్టేయడం గ్యారెంటీ అనిపిస్తుంది.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు