నాగార్జున, చిరంజీవి మల్టీ స్టారర్ ఫిక్స్.. అలాంటి కథతో అంతా సిద్ధం?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కడం సర్వసాధారణం.ఇలా మల్టీస్టారర్ చిత్రాలు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచే ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో కూడా ఈ విధమైనటువంటి మల్టీస్టారర్ చిత్రాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

తాజాగా ఇలాంటి మల్టీస్టారర్ చిత్రం మరొకటి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.సీనియర్ హీరోలు అయిన నాగార్జున చిరంజీవి ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చిత్రంలో చేయబోతున్నారా అంటే అవుననే చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

కొన్ని దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి నాగార్జున ఇప్పటికే ఎన్నో సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని ప్రస్తుత హీరోలకు దీటుగా సినిమాలను చేస్తున్నారు.ఈ క్రమంలోనే చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తమిళం మలయాళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగులో రీమేక్ లో నటిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే లూసిఫర్, వేదాళం వంటి రీమేక్ చిత్రాలలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా కోలీవుడ్‌లో మాధవన్, విజయ్ సేతుపతి నటించినవిక్రమ్ వేదసినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చిరు భావించారు.అయితే ఇందులో ఇద్దరు హీరోలు ఉండడంచేత తెలుగులో కూడా చిరంజీవి నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చిత్రంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ రీమేక్ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించగా, మాధవన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నట్లు సమాచారం.

పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఏ దర్శకుడు చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.ఇప్పటికే చిరు, నాగ్‌లతో కూడిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం.మరి ఈ విషయాలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు