భీష్మకు ఆచార్య అక్షింతలు..!

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఛలో ఫేం దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపారు.

ఇక ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో, భీష్మను చూసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.ఇకపోతే ఈ సినిమాను చూసిన ఆడియెన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా నితిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.తాజాగా ఆయన భీష్మ సినిమాను చూసి నితిన్‌ను మెచ్చుకున్నారు.

ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా మలిచిన చిత్ర యూనిట్‌ను చిరు ప్రశంసించారు.మంచి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నందుకు నితిన్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

Advertisement

ఇలా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాను చూసి మెచ్చుకున్నందుకు నితిన్ సంతోషంలో మునిగిపోయాడు.రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం అందుకోవడం నిజంగా సంతోషంగా ఉందంటూ నితిన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!
Advertisement

తాజా వార్తలు