కన్ఫర్మ్‌.. గాడ్ ఫాదర్ విడుదల వాయిదా, ఎందుకంటే!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ మెగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

కానీ తాజా పరిణామాలను గమనిస్తూ ఉంటే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విడుదలకు మరో రెండు వారాల గడువు కూడా లేదు, అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న వాల్తేరు వీరన్న షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.సరే సోమవారం నుండి అయినా ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడేమో అని అంతా భావించారు, కానీ నేటి నుండి రాజమండ్రిలో అదే సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలలో రవితేజ మరియు చిరంజీవి కలిసి పాల్గొంటున్నారు.

దాంతో గాడ్ ఫాదర్ సినిమా ని గాలికి వదిలేసారా.లేదంటే అసలు సినిమా వాయిదా పడే అవకాశం ఉందా అంటూ మెగా అభిమానులు చర్చ జరుగుతుంది.

మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్‌ అన్నట్లుగా రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని భావించారు.

Advertisement

కానీ సల్మాన్ ఖాన్ పాత్ర చిత్రీకరణ మరియు సినిమా అస్సలు సరిగా రాలేదని హిందీలో విడుదల చేయకూడదంటూ ఇప్పటికే నిర్ణయించారు.తెలుగులో అయినా విడుదల అవుతుందా లేదా అంటే ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విడుదల విషయంలో అనుమానాలు కలిగిస్తున్నాడంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు మూడు రోజుల తర్వాత అయినా మెగాస్టార్ ఈ సినిమా విడుదల విషయమై క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు