మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) రీఎంట్రీలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఆచార్య, భోళా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

వాల్తేరు వీరయ్య హిట్ గా నిలిచినా ఈ సినిమా సక్సెస్ లో రవితేజకు ( Ravi Teja )కూడా క్రెడిట్ ఉందనే సంగతి తెలిసిందే.చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ గ్లింప్స్( Vishwambhara Movie Glimpses ) ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

విశ్వంభర గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.

చిరంజీవి శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Chiranjeevi Gave Chance To One More Young Director Details Inside Goes Viral ,
Advertisement
Chiranjeevi Gave Chance To One More Young Director Details Inside Goes Viral ,

చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.చిరంజీవికి ఇతర భాషల్లో సైతం క్రేజ్ భారీ స్థాయిలో ఉంది.అయితే ఆ క్రేజ్ కు తగిన సినిమాలు అయితే చిరంజీవి నుంచి రావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవిస్ శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ ఏ బ్యానర్ లో తెరకెక్కుతుందో చూడాలి.

Chiranjeevi Gave Chance To One More Young Director Details Inside Goes Viral ,

మెగాస్టార్ చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని అప్పుడే భారీ విజయాలు దక్కుతాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.చిరంజీవికి 2025 సంవత్సరం అయినా కలిసొస్తుందేమో చూడాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల హవా గత కొంతకాలంగా తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది విడుదలైన మెగా హీరోల సినిమాలేవీ మరీ భారీ స్థాయిలో మెప్పించలేదు.2025లో మాత్రం మెగా హీరోల సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవుతుండటం గమనార్హం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు