ఆచార్య సినిమాను అలా తీసి ఉంటే ఇప్పటికీ పూర్తి అయ్యేది కాదు: చిరంజీవి

సాధారణంగా సినిమాను తెరకెక్కించాలి అంటే ఆ కథను బట్టి సినిమాని షూటింగ్ చేయడం కోసం వివిధ ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ క్రమంలోనే కొన్ని సినిమా షూటింగులు పలు అందమైన లొకేషన్ లలో షూటింగులు జరుపుకోగా మరికొన్ని సినిమాలు భారీ సెట్టింగులు వేసి షూటింగ్ జరుపుకుంటూ ఉంటారు.

ఇలా సినిమా కథను బట్టి షూటింగ్ జరుపుకొనే విధానంలో దర్శకనిర్మాతలు మార్పులు చేర్పులు చేసుకుంటారు.ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య.

ఈ సినిమా ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కింది.ఈ క్రమంలోనే అలాంటి టెంపుల్ టౌన్ లో సినిమా చేయాల్సి ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్నో రకాల టెంపుల్స్ సందర్శించారు.

ఒక పురాతన దేవాలయం చుట్టూ కొండలు, నదులు, గుడిసెలు ఉండే ప్రాంతం కోసం చిత్రబృందం ఎన్నో ప్రదేశాలను సందర్శించారు.ఇలా ఈ విధమైనటువంటి లొకేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని ఒకేచోటే కుదరకపోవడంతో చిత్రబృందం ఈ సినిమా కోసం ధర్మస్థలి సెట్ వేశారు.

Advertisement

ధర్మస్థలి సెట్ కోసం 20 ఎకరాల భూమిలో సుమారు కొన్ని కోట్లు ఖర్చు చేసి ఈ పురాతన దేవాలయాన్ని నిర్మించారు.

ఇలా ఈ ధర్మస్థలి సెట్ ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పై చిత్రబృందం ప్రశంసలు కురిపించారు.ఈ విధంగా ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ దొరకకపోవడంతో కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుచేసి భారీ సెట్ వేశారు.ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం ఇక్కడే జరుపుకుంది.

ఇక ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఆచార్య సినిమా షూటింగ్ కోసం ధర్మస్థలి సెట్ వేయకపోతే,అలాంటి ప్రదేశాన్ని వెతికి సినిమా షూటింగ్ చేసేసరికి ఎంతో ఆలస్యం అవుతుంది.ఇలా సెట్ వేయకుండా, ఈ సినిమా షూటింగ్ కనుక తీసి ఉంటే ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది కాదు అంటూ మెగాస్టార్ చిరంజీవి ధర్మస్థలి సెట్ గురించి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఇక మెగా స్టార్ మెగా పవర్ స్టార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు