ట్యూషన్లు చెబుతూ ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి.. ఎంతో గ్రేట్ అంటూ?

ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.

నల్గొండ జిల్లాకు చెందిన చింతల తులసి( Chintala Tulsi ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఉస్మానియా యూనివర్సిటీలో( Osmania University ) ఎంటెక్ పూర్తి చేసిన తులసి గతంలోనే గ్రూప్4 తో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్ జాబ్స్ సాధించారు.ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ఏఈ జాబ్ సాధించిన తులసి ఆగష్టు నెల 2వ తేదీన ఏఈఈ జాబ్ సాధించారు.

వెంకన్న, లక్ష్మి ( Venkanna, Lakshmi )దంపతుల మూడో కూతురు అయిన తులసి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నారు.ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా రెండు సంవత్సరాల పాటు తులసి ప్రిపేర్ అయ్యారు.గ్రూప్ 4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు వచ్చినా తులసి ఆ ఉద్యోగాలను వదులుకోవడం జరిగింది.గ్రూప్1 జాబ్ సాధించడమే టార్గెట్ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఏఈఈ పరీక్షకు ప్రిపేర్ ( AEE Exam ) అవుతున్న సమయంలో నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తులసి పేర్కొన్నారు.ట్యూషన్లు చెబుతూ వచ్చిన డబ్బులతో బుక్స్ కొనుగోలు చేసి హాస్టల్ ఫీజు కట్టానని తులసి వెల్లడించారు.అమ్మానాన్నల ప్రోత్సాహంతో చదువుపై నేను దృష్టి పెట్టానని తులసి పేర్కొన్నారు.

Advertisement

రాబోయే రోజుల్లో మరిన్ని లక్ష్యాలను సాధించాలని ఉందని తులసి వెల్లడించారు.

చింతల తులసి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.చింతల తులసి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చింతల తులసి కోరుకున్న లక్ష్యాలను రాబోయే రోజుల్లో సాధిస్తే ఆమె మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

చింతల తులసి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.చింతల తులసి ఈ జనరేషన్ లో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!
Advertisement

తాజా వార్తలు