భారత్‌పై దొంగచాటున నిప్పులు కక్కిన డ్రాగన్ కంట్రీ... పాకిస్తాన్ ఉగ్రవాదులకు భయంకరమైన ఆయుధాలు పంపణీ!

దేశ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వుంది.పాకిస్తాన్-చైనా కలిపి భారత్ పైన కుట్రలు గత దశాబ్దాలుగా చేస్తున్నాయి.

అయితే వారి ఉగ్ర కుట్రలను భారత బలగాలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నాయి.ఎలాగైనా భారత్ లోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న టెర్రరిస్టులకు ఇండియన్ ఆర్మీ ఈమధ్యకాలంలో చుక్కలు చూపిస్తోంది.

తాజాగా జమ్ము కశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు.అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆందోళనకు గురి చేస్తోంది.

అవును.బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్ కమల్ కోట్ లో ఉగ్రకుట్రను భారత సైన్యం తాజాగా భగ్నం చేసింది.

Advertisement

లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముగ్గురు ఉగ్రవాదులను మన ఆర్మీ అంతం చేసింది.ఈ ఎన్ కౌంటర్ లో హతమైన టెర్రరిస్టుల నుంచి AK సిరీస్ కు చెందిన రెండు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు చైనాలో తయారైన రైఫిల్ దొరికాయి.

చైనా మేడ్ ఎం16 రైఫిల్ పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గర దొరకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే విషయం పలు అనుమానాలకు దారి తీస్తోంది.చైనా తన ఆయుధాలను పాకిస్తాన్ సైన్యానికి అమ్మితే, వాటిని పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు సరఫరా చేస్తుందా? లేక డ్రాగన్ కంట్రీనే నేరుగా ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లయ్ చేస్తూ టెర్రరిజానికి మద్దతు ఇస్తోందా? అనే పలు రకాల అనుమానాలు కలుగుతున్నాయి.వారి దగ్గరికి మేడిన్ చైనా ఎం16 రైఫిల్స్ ఎలా వచ్చాయి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

వీటిలో ఏది నిజమై ఉంటుంది అనేది తేల్చే పనిలో భారత అధికారులు బిజీగా వున్నారు.

తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)
Advertisement

తాజా వార్తలు