కరోనా విషయంలో భారత్ కి సహాయం చేస్తామంటున్న చైనా....

ఎక్కడో చైనాలోని వూహన్ అనే నగరంలో పుట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కొత్తగా చెప్పనవసరం లేదు.

ఇప్పటికే ఈ మహమ్మారి కరోనా వైరస్ సోకి దాదాపుగా వేల సంఖ్యలో మృతిచెందగా లక్షల సంఖ్యలో ఈ కరోనా వైరస్ లక్షణాలతో ప్రపంచ వ్యాప్తంగా బాధ పడుతున్నారు.

అయితే ఇప్పటికే ఇటలీ దేశం ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయలేనందుకు ఆ దేశ అధ్యక్షుడు కంటతడి పెట్టుకున్న ఘటన అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ కరోనా వైరస్ విషయంలో భారతదేశానికి చైనా దేశం సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా సోమవారం రోజున భారతదేశ పలువురు ప్రధాన అధికారులతో చైనా విదేశాంగ అధికారి జంగ్ షూయంగ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.తాము కష్ట కాలంలో ఉన్న సమయంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు విదేశాంగ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తమకు ఎంతో సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.

అంతేకాక వ్యూహన్ నగరంలో ఈ కరోనా వైరస్ తో పోరాడుతూ అవస్థలు పడుతున్న సమయంలో భారతదేశ వైమానిక దళం నుంచి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగించేటటువంటి సామాగ్రిని సరఫరా చేసిందని తెలిపారు.ఇందుకు ప్రతిఫలంగా ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు అవసరమైనటువంటి యాంటీబయాటిక్స్, సలహాలు, సూచనలు వంటివి కూడా అందిస్తామని తెలిపారు.

Advertisement

అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి కష్టకాల సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకు సాగితే ఎంతటి మహమ్మరినైనా ఆపవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనప్పటికీ చైనా దేశ ప్రభుత్వ అధికారులు భారతదేశానికి ఈ విషయంలో సహాయం చేస్తే సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు