వర్షాకాలంలో ఇలా చేస్తే పిల్లలు జబ్బు పడరు

పెద్దవారికంటే పిల్లలు తొందరగా జబ్బుపడుతూ ఉంటారు.ఎటువంటి కాలంలో అయినా సరే ముందుగా అనారోగ్యాల బారినపడేది పిల్లలే.

ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి పరిస్థతి ఎదురవుతూ ఉంటుంది.ఎందుకంటే పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటమే కారణం.

Child Care During Monsoon Season Details, Children, Unhealthy, Viral Infections,

జలుబు, దగ్గు, తద్వారా జ్వరం రావడం వర్షాకాలంలో మనం ఎక్కువగా పిల్లల్లోనే చూస్తూ ఉంటాం.వర్షాకాలంలో పిల్లల అల్లరికి కూడా హద్దు ఉండదు.

వర్షంలో పిల్లల ఆటలు ఎక్కువగానే ఉంటాయి.అయితే ఎంత ఆడుకున్నా సరే పిల్లల్లో రోగనిరోధకశక్తి సమానంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు.

Advertisement

మనం తీసుకోవలసిన జాగ్రతలు కూడా చాలానే ఉన్నాయి.ఇంటి పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవడం అవసరమే.

దీనికోసం తల్లులకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు.బయటి నుంచీ వచ్చే చల్లదనం, గాలి వల్ల గది ఉష్ణోగ్రత తగ్గిపోవచ్చు.

గది ఉష్ణోగ్రత లో ఆకస్మిక మార్పులు చిన్నారుల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.కాబట్టి గది పొడిగా, తగినంత వెచ్చగా ఉండేలా చూసుకోండి.

స్వెట్టర్లు, రగ్గులు, బ్లాంకెట్స్‌ ముందుగానే క్లీన్‌ చేసి రెడీగా పెట్టుకోండి.బయటి పదార్థాలు, చిరుతిళ్లు పెట్టకండి.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఇది తీసుకోవడం మాత్రం మరవకండి!

అమ్మ చేతి వంటే ఆరోగ్యకరం.పిల్లల పాదాలు అన్ని సమయాల్లో పొడిగా ఉండేలా చూడండి.

Advertisement

ఇంట్లో స్లిప్పర్స్‌, సాక్స్‌ వేసుకోవడం అలవాటు చెయ్యండి.దోమలు, కీటకాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

లెమన్ టీ కానీ గ్రీన్ టీ లని కానీ పిల్లలకి అలవాటు చేయడం మంచిది.

తాజా వార్తలు