రోజుకు 15 గంటల చదువు.. జేఈఈలో ఆలిండియా టాపర్.. చిద్విలాస్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

రోజులో మూడు నుంచి 4 గంటలు చదవడానికే చాలామంది ఎంతో కష్టపడుతుంటారు.అయితే పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు సాధించాలంటే మాత్రం రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది.

ఆయితే జేఈఈలో ఆలిండియా టాపర్ గా నిలిచిన చిద్విలాస్ రెడ్డి( Chidvilas Reddy ) రోజుకు 15 గంటలు చదవడం ద్వారా లక్ష్యాన్ని సాధించానని చెబుతున్నారు.నమ్మకం, కష్టపడేతత్వం, తపన ఉంటే సక్సెస్ సొంతమవుతుందని చిద్విలాస్ కామెంట్లు చేస్తున్నారు.

జేఈఈ అడ్వాన్స్డ్( JEE Advanced ) లో చిద్విలాస్ రెడ్డి ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించారు.తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చిద్విలాస్ తల్లీదండ్రులు టీచర్లుగా పని చేస్తున్నారు.6వ తరగతి నుంచి శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో చదివిన చిద్విలాస్ అక్కడే జేఈఈకి శిక్షణ తీసుకున్నారు.ప్రతిరోజూ 15 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా చదివానని ఆయన చెప్పుకొచ్చారు.

చదివే సమయంలో అరగంట పాటు రెస్ట్ తీసుకునేవాడినని చిద్విలాస్ రెడ్డి కామెంట్లు చేశారు.ప్రతి సబ్జెక్ట్ ను ప్రణాళికాబద్ధంగా చదివానని ఆయన చెప్పుకొచ్చారు.360 మార్కులకు 341 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించానని అన్నారు.వీలైనన్ని ఎక్కువగా మాక్ టెస్ట్ లు రాయాలని చిద్విలాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

లోపాలను సరి చేసుకుంటూ పోతే సక్సెస్ దక్కుతుందని అన్నారు.

నా సక్సెస్ కు నా పేరెంట్స్, కాలేజ్ ఫ్యాకల్టీ కారణమని చిద్విలాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.నా అన్నయ్య నాకు స్పూర్తి అని అన్నయ్య ప్రస్తుతం బిట్స్ పిలానీలో బీటెక్ ఫైనల్ ఇయర్ ( BTech Final Year at BITS Pilani )చదువుతున్నారని చిద్విలాస్ రెడ్డి కామెంట్లు చేశారు.చిద్విలాస్ రెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

విద్యార్థులకు చిద్విలాస్ రెడ్డి సక్సెస్ స్టోరీ స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.చిద్విలాస్ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

చిద్విలాస్ రెడ్డి సక్సెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు