జలదిగ్బంధంలో చెన్నై

ఎడతెరపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై నగరం చిగురుటాకుల వణుకుతోంది.పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

రోడ్లు, కాల్వలు ఏకమైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నగరంలోని అవడి, మనలి, పొన్నేరి వంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.

రిజర్వాయర్లు అన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి.దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది.

దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం సబ్ వేలను మూసివేశారు.తిరుత్తనిలో అత్యధికంగా 13 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు