ఆ వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్.. బురద జల్లే ప్రయత్నమంటూ?

సినిమా రంగంలో, వ్యాపార రంగంలో విజయాలను అందుకుంటూ రామ్ చరణ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఈ ఏడాది రెండు సినిమాలను వచ్చే ఏడాది జనవరిలో ఒక సినిమాను రిలీజ్ చేసేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండగా శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అయితే రామ్ చరణ్ కు సంబంధించిన ట్రూ జెట్ గురించి ఈ మధ్య కాలంలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ సంస్థ నష్టాల్లో ఉందని ఈ సంస్థ సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించడం లేదని సంస్థ సర్వీసులు ఆగిపోయాయని జోరుగా ప్రచారం జరిగింది.

సాధారణంగా చరణ్ కు సంబంధించి నెగిటివ్ వార్తలు గతంలో ఎప్పుడూ రాలేదు.అయితే ఇప్పుడు మాత్రం చరణ్ గురించి ఇలాంటి వార్త ప్రచారంలోకి రావడంతో చరణ్ అభిమానులు సైతం ఒకింత కంగారు పడ్డారు.

అయితే వైరల్ అయిన వార్త గురించి చరణ్ స్పందించారు.వైరల్ అయిన వార్త తనపై బురద జల్లే ప్రచారమని చరణ్ చెప్పుకొచ్చారు.

Advertisement
Charan Shocking Comments About Trujet Viral News Details, Ram Charan, Trujet, Tr

వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు.

Charan Shocking Comments About Trujet Viral News Details, Ram Charan, Trujet, Tr

ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందుతున్నాయని ఆయన వెల్లడించారు.తమ సంస్థ సర్వీసులు ఆగిపోయాయని జరిగిన ప్రచారం నిజం లేదని పేర్కొన్నారు.తక్కువ ధరలకే విమాన సర్వీసులను అందిస్తున్న సంస్థలలో ట్రూజెట్ కూడా ఒకటి.ప్రస్తుతం ట్రూజెట్ సంస్థ నిధుల సమీకరణ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.165 కోట్ల రూపాయల నిధులను ఒక ఇన్వెస్టర్ నుంచి సేకరించనున్నట్టు తెలుస్తోంది.త్వరలో ట్రూజెట్ సంస్థ సర్వీసులు మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.

త్వరలో ఈ సంస్థకు సంబంధించి కొత్త సీఈవోను ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు