తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

తుమ్మల కోసం స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన బాధ్యతలను రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు అప్పగించారని సమాచారం.ఈ క్రమంలోనే మాజీ మంత్రి తుమ్మల నివాసానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు.

అయితే సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల హస్తం గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా కాంగ్రెస్ మాత్రం కూకట్ పల్లి నుంచి పోటీ చేయించే యోచనలో ఉంది.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు