పవన్ అవసరం ఉండొచ్చేమో ! బాబు మెతక వైకిరికి కారణం ఇదేనా ..?

రాజకీయాల్లో ఉన్న వారికి ఎప్పడు ఎవరి అవసరం వస్తుందో తెలియదు.అప్పటివరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకులను కూడా.

కావలించుకుని పొగడ్తల వర్షం కురిపించాల్సి ఉంటుంది.బద్ద శత్రువులను కూడా కలుపుకుపోవాల్సి ఉంటుంది.

రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు సాధారణమే.టీడీపీ కి ఆజన్మ విరోధి అయిన కాంగ్రెస్ తో ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణాలో సిద్ధం అయ్యింది.

అలాగే కొద్దీ నెలల క్రితంవరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జనసేన, బీజేపీ పార్టీలతో సున్నం పెట్టుకుంది టీడీపీ.ప్రస్తుతం జనసేనాని టీడీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నా టీడీపీ మాత్రం ఆచి తూచి స్పందిస్తోంది.

Advertisement

దీని వెనుక అసలు కదా వేరే ఉందని టీడీపీ లో వినిపిస్తున్న మాట.

పవన్ టీడీపీ ల బంధం పైకి కనిపించకపోయినా అంతర్గతంగా వారి మధ్య ఏదో తెలియని రహస్య పొత్తు ఉందని అనుమానాలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ తమ పార్టీ జనాలకు, అలాగే పార్టీకి మద్దతుగా నిలిచిన మీడియాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసారన్న విషయం లోలోపల వినిపిస్తోంది.పవన్ పై ఎటువంటి విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయని టాక్.

అలాగే తమ అనుకూల మీడియా కూడా పవన్ విషయంలో కాస్త చూసీచూడనట్టుగా వ్యవహారించాలని సూచనలు అందాయట.ఏపీలో జరగబోయే ఎన్నికలు మూడు ప్రధాన పార్టీ ల మధ్య హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది.

ఒక వేళ ఆ ఎన్నికల్లో టీడీపీ కి మెజార్టీ సీట్లు రాకపోతే అప్పుడు పవన్ లాంటి నాయకుల అవసరం ఉంటుందని అందుకే.ఇప్పటి నుంచే పవన్ విషయంలో కొంచెం మెతకవైకిరి అవలంబించాలని టీడీపీ చూస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

దీనికి మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలను లెక్కలోకి తీసుకుంటున్నారు.

Advertisement

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని టార్గెట్ చేసారు పవన్ కళ్యాణ్.దీనివెనుక కూడా బాబు మనోగతం వుందని వినిపిస్తోంది.చింతమనేని వ్యవహారాలు చిరకాలంగా తలనొప్పిగా వున్నాయి చంద్రబాబుకు.

ఆయన ఒకటి రెండుసార్లు గట్టిగా మాట్లాడారు కానీ చింతమనేని మారలేదు.ఇప్పుడు బాబు నేరుగా చర్యలు తీసుకున్నా, టికెట్ కాదన్నా పరిస్థితి వేరుగా వుంటుంది.

అలాచేసే కన్నా, పవన్ లాంటి వాళ్లు ఫుల్ గా టార్గెట్ చేస్తే, చంద్రబాబు పని ఈజీ అవుతుంది అందుకే టీడీపీ అధినేత పవన్ ద్వారా ఈ విమర్శలు చేయిస్తున్నాడా అనే అనుమానాలు కూడా ఈ వ్యవహారాలను బట్టి బలపడుతున్నాయి.

తాజా వార్తలు