సాధారణంగా తమ ప్రత్యర్థులపై రాజకీయ నాయకులు తమ రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు ఎన్నికలనే ప్రధాన అస్త్రంగా వినియోగించుకుంటారు.కానీ, ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కేసీఆర్‌కు ఇబ్బంది కరంగానే పరిణమిస్తున్నాయి.
రాష్ట్రంలో తనకు ఎదురు నిలుస్తారని, తనను ఇబ్బంది పెడతారని భావిస్తున్న నాయకులకు కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నాడు.అయితే ఎక్కడ తన ప్రమేయం ఇందులో ఉంది అని బయటకి రాకుండా ఆయా నాయకులపై ఉన్న పాత పెండింగ్ కేసులను బయటకి తీసి ఇబ్బంది పెట్టేలా వ్యూహాలు అమలు చేస్తున్నాడు.

ఎన్నికల దగ్గరపడుతుండటంతో పాత కేసులతో కాంగ్రెస్ నేతలను అణగదొక్కేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు టీఆర్ఎస్ చేతకానితనానికి నిదర్శనమని ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.అయితే, ఇక్కడే మరో ప్రశ్న కూడా ఉదయిస్తోంది.ఐటీ దాడుల ఫలితంగా టీఆర్ ఎస్ రేటింగ్ పెరుగుతుందా? తరుగుతుందా? అనేది! రేవంత్ పై పెట్టిన కేసులు, ఆయన సంపాదించిన ఆస్తులు, అక్రమాల చిట్టా పత్రికా కార్యాలయాలకు దాడులు జరిగే సమయంలోనే అందడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

అయితే ఏ మధ్యకాలంలో డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ మీద కేసు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా అందరూ రాజకీయ కక్షల నేపథ్యంలో కేసీఆర్ వారిని ఇరికిస్తున్నారు అనే అనుమానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయాయి.దీంతో ఈ పరిణామాలపై ఆందోళన చెందిన గులాబీ నేతలు కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తున్నారట.నాయకులపై కేసుల సంగతి ప్రభుత్వం వచ్చినప్పుడే చేసి ఉంటే బాగుండేదని, కానీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తరుణంలో ఈ విధంగా చేయడం వల్ల వారిపై సానుభూతి పెరిగి అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళనలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.







