బాబు జిల్లాల టూర్ నేటి నుంచే ! షెడ్యూల్ ఇలా ?

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే ధ్యేయంగా  టిడిపి అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా పేరుతో బాబు జిల్లా పర్యటనలు చేపడుతున్నారు .

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా బాబు టూర్ ప్లాన్ చేస్తున్నారు.అలాగే మధ్య మధ్య లో భారీ బహిరంగ సమావేశాలు, పార్టీ కీలక నాయకులతో మీటింగులు, నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి ఏవిధంగా ఉంది ? నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు, ఇలా అనేక అంశాలపై బాబు ఈ పర్యటనలోనే దృష్టి పెట్టబోతున్నారు.ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా సిద్ధమైంది.

అలాగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాలలో మినీ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా చోడవరం జరుగనున్న తొలి మహానాడు తో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది .వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేయడంలో విఫలమైందని, జగన్ పరిపాలన లో అందరూ ఇబ్బందులు పడుతున్నారని , విధ్వంస పరిపాలనకు జగన్ శ్రీకారం చుట్టారని, ఎలా అనేక అంశాలతో బాబు జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.జిల్లాల పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు.

Chandrababu Naidu Is Touring The Districts From Today, Chandrababu, Tdp, Ap, Tel

ఈ మేరకు ఆయా జిల్లాల్లో తొలిరోజు మహానాడు, రెండో రోజు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం, మూడోరోజు ప్రజాసమస్యలను ప్రభుత్వ తీరుపై రోడ్ షో కార్యక్రమాలను చంద్రబాబు నిర్వహించనున్నారు .ఈ విధంగా ఏడాది పాటు చంద్రబాబు వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.ఈ జిల్లాల్లో టూర్లు సాధారణంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ధ్యేయంతో పని చేస్తారని, అలాగే ప్రజలను టిడిపి పై ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Chandrababu Naidu Is Touring The Districts From Today, Chandrababu, TDP, AP, Tel

అని , విధ్వంస పరిపాలనకు జగన్ శ్రీకారం చుట్టారని, ఎలా అనేక అంశాలతో బాబు జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు జిల్లాల పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు.

ఫోర్బ్స్ జాబితా ...రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా... బాగానే వెనకేసిన నటి!
Advertisement

తాజా వార్తలు