బాబు ముఖంలో ఆనందం నింపిన టీడీపీ పట్టాబీ ?

నిన్న టిడిపి కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం ఏపీలో పెద్ద సంచలనం సృష్టించడంతో పాటు, రాజకీయంగానూ పెద్ద దుమారం రేపింది.

వైసీపీ శ్రేణులు దాడికి నిరసనగా ఈ రోజు టిడిపి రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది.

వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి సంచలన విమర్శలు చేశారు.ఆ విమర్శలు సహజంగానే వైసీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.

దీంతో టిడిపి కార్యాలయాలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దాడులకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.అయితే ఈ దాడులపై ఏపీ లోని అన్ని పార్టీలు టీడీపీ కి మద్దతుగా నిలిచి వైసీపీ పై విమర్శలు చేశాయి.

వాస్తవంగా పట్టాభి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయకపోతే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు .        ఆ స్థాయిలో ఆయన జగన్ పై విమర్శలు చేశారు.పట్టాభి విమర్శలు తరువాత వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు దిగడం తో పట్టాభి చేసిన వ్యాఖ్యలను అందరూ పక్కన పెట్టి , వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయాలపై చేసిన దాడుల  విషయాన్నే హైలెట్ చేశారు.

Advertisement

కాంగ్రెస్ , జనసేన ఈ విషయంలో ఎక్కువగానే స్పందించాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి కార్యాలయంలో జరిగిన దాడులను ఖండించారు.దీనికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కాకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడా పట్టాభి జగన్ పై చేసిన విమర్శల విషయాన్ని ప్రస్తావించలేదు.ఇక కమ్యూనిస్టు పార్టీలు ఇదే విధంగా స్పందించారు.

పట్టాభి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా టిడిపికి మద్దతు తెలిపారు.  కాంగ్రెస్ విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ నేతలంతా టిడిపి పై సానుభూతితో కురిపించారు.   

    స్వయంగా టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్లి పరామర్శించారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాథ్తో పాటు,  కాంగ్రెస్ కీలక నాయకులంతా టిడిపి కార్యాలయంపై జరిగిన దాడులను ఖండించారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపిపై సానుభూతి పెరిగింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

అన్ని పార్టీలు వైసీపీ పై విమర్శలు చేస్తూ, టిడిపి కి అండగా నిలబడ్డాయి.దీంతో చంద్రబాబు లోనూ ఎక్కడలేని ఆనందం కనిపించింది.

Advertisement

టిడిపి కార్యాలయంలో జరిగిన దాడులపై విచారణ కంటే, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కి మద్దతుగా అన్ని పార్టీలు ఏకమైనా తీరు ఎక్కడలేని ఆనందాన్ని కలిగించాయి.మొత్తానికి బాబు ముఖంలో ఆనందం కలిగేలా టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి చేయగలిగారు.

   .

తాజా వార్తలు