తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీలో సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమాన్ని నడిపించి విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి అశోక్ బాబు.ఏపీ ఎన్జీవో అధ్యక్షుడుగా ఉంటూ ప్రత్యేక తెలంగాణని తీవ్రంగా వ్యతిరేకించి, తెలుగు ప్రజల ద్రుష్టిని అశోక్ బాబు ఆకట్టుకున్నారు.
సమైక్యాంద్ర ఉద్యమాన్ని రాజకీయ నాయకులు కూడా వదిలేసిన టైంలో తన వాణిని బలంగా వినిపించిన వ్యక్తిగా అశోక్ బాబు తెలుగు ప్రజలకి దగ్గరయ్యారు.ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూనే తెలంగాణని అశోక్ బాబు వ్యతిరేకించారు.
ఇదిలా వుంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అశోక్ బాబు అమరావతికి వెళ్ళిపోయారు.అయితే ఉద్యమ సమయంలో వచ్చిన పేరుని అశోక్ బాబు తన రాజకీయ ఎదుగుదలకి ఉపయోగించుకుంటున్నారు.
ఉద్యోగ విరమణ తర్వాత అశోక్ బాబు టీడీపీ పార్టీలో చేరారు.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అశోక్ బాబుకి పార్టీలో సముచిత స్థానం కల్పించారు.
ఇదిలా వుంటే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా ఏపీలో టీడీపీ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్ధిగా అశోక్ బాబుని చంద్రబాబు ఖరారు చేసారు.ఇప్పటికే ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న యనమలని మళ్ళీ కొనసాగించగా, కొత్తగా అశోక్ బాబుకి అవకాశం కల్పిస్తున్నారు.