స్టార్‌ హీరో భార్య వాడుతున్న ఫోన్‌ ఏదో తెలిస్తే నోరెళ్లబెట్టి, వావ్‌ గ్రేట్‌ అంటారు

ఈమద్య కాలంలో ఎవరి చేతిలో చూసినా కూడా స్మార్ట్‌ ఫోన్‌లు ఉంటున్నాయి.ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్‌ ఫోన్‌లు వాడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామం అయ్యింది.

 Ajiths Wife Shalini Surprises Fans With Her Phone-TeluguStop.com

టెక్నాలజీ పెరగడం మంచిదే కాని, దాన్ని కొందరు విపరీతమైన పనులకు వాడుతున్నారు.కొందరైతే స్మార్ట్‌ ఫోన్స్‌కు బానిసగా మారిపోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతో మంది పిల్లలు కూడా స్మార్ట్‌ ఫోన్‌లకు బానిసగా మారుతున్నారు.పిల్లలు కారణంగానో లేదా మరేంటో కాని తమిళ స్టార్‌ హీరో అజిత్‌ భార్య నోకియా బేసిక్‌ పీచర్‌ ఫోన్‌ వాడుతున్నారు.

అజిత్‌ భార్య షాలిని తాజాగా ఒక కార్యక్రమంలో పిల్లలతో పాటు పాల్గొన్నారు.ఆసందర్బంగా ఆమె చేతిలో నోకియా బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ కనిపించి అందరు కూడా అవాక్కయ్యారు.ఆమెను రెగ్యులర్‌ గా ఫాలో అయ్యే వారు మాత్రం దాంట్లో కొత్తేం ఉంది, షాలిని ఎప్పుడు కూడా ఆ ఫోన్‌ను వాడుతుంది.ఈరోజు ప్రత్యేకంగా ఏమీ కాదు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

అయితే ఇన్ని రోజుల సంగతి ఏమో కాని తాజాగా షాలిని చేతిలో చిన్న మొబైల్‌ ఫోన్‌ను చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.

అజిత్‌ ఒక్కో సినిమాకు 10 కోట్లకు మించి పారితోషికం తీసుకుంటారు అంటూ ప్రచారం ఉంది.అలాంటి అజిత్‌ భార్య కోరుకుంటే ఐఫోన్‌ లేటెస్ట్‌ మోడల్‌ను వాడగలదు.కాని ఆమెకు ఆసక్తి లేకపోవడం వల్లో లేక మరేంటో కాని షాలిని మాత్రం కేవలం మూడు వేల రూపాయల ఫోన్‌ను వాడుతోంది.

మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో అవసరం లేదు.అవసరం ఉన్నా లేకున్నా ఫోన్‌ను వాడటం ఎందుకు, షాలినిని చూసి అంతా నేర్చుకోవాలి, నిజంగా అజిత్‌ మరియు షాలిని ఈజ్‌ గ్రేట్‌.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube