హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం!

తెలిసి తెలియని వయసులో ప్రేమ మాటున వ్యామోహం కుర్రాళ్ళని ఉన్మాదులుగా మార్చేస్తుంది.ప్రేమ పేరుతో వేదింపులకి పాల్పడటం, కుదరదంటే హతమార్చడం మగాళ్ళకి అలవాటుగా మారిపోయింది.

 Lover Murder Attempt On Girl In Hanamkonda-TeluguStop.com

ప్రేమించిన తర్వాత పెళ్లి అంటే అడ్డుతొలగించుకోవడం కూడా మృగాళ్లకి నిత్యకృత్యంగా మారింది.ఆ మధ్య హైదరాబాద్ లో మధులిక అనే ఇంటర్ అమ్మాయిని ప్రేమ పేరుతో ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఆ ఉదంతం ఇంకా మరిచిపోక ముందే హన్మకొండలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

హన్మకొండ నయీమ్ నగర్ లో వాగ్దేవి కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళి ఆనే అమ్మాయిని అన్వేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

తనని రక్షించాలని యువతీ కేకలు వేయడంతో రక్షించేందుకు వచ్చిన వారిని అన్వేష్ బెదిరించాడు.దీంతో ఆమె శరీరం 90 శాతం కాలిపోయి పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తుంది.

స్థానికులు ఆమెని ఎంజీఎం హాస్పిటల్ లో చేర్చినట్లు తెలుస్తుంది.రవళిపైన దాడి చేసిన ప్రేమోన్మాది అన్వేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అతను ఈ దురాగతానికి ఎందుకు పాల్పడ్డాడు అనే విషయం తెలియాల్సి వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube