వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు దర్యాప్తు నాలుగు సంవత్సరాలు నుండి జరుగుతోంది.ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది.2019 మార్చి నెలలో అతికిరాతకంగా వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు.ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.
( CBI ) విచారణ చేపడుతూ ఉంది.అయినా గాని ఓ కొలిక్కి రాలేదు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా దివంగత వివేక కుమార్తె సునీత,( Suneetha ) అల్లుడు రాజశేఖర్ రెడ్డి ( Rajashekar Reddy ) సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ లపై పోలీసులు పులివెందుల కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది.సునీత, రాజశేఖర్ చెప్పినట్లే వ్యవహరించాలని రామ్ సింగ్ బెదిరించారని పీఎ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్( SP Ram Singh ) ఒత్తిడి తీసుకొచ్చినట్లు పిటిషన్ లో వివరించారు.సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.న్యాయం చేయాలని అప్పట్లో ఎస్పీగా ఉన్న అనుభూ రాజన్.కలసి వినతి పత్రం అందజేసిన ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్ లో వివేకకి పీఎగా పనిచేసిన కృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 15వ తారీకు.పోలీసులను ఆదేశించింది.ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.