వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో అజింక్యా రహానే కు ఛాన్స్..!

ఐపీఎల్ సీజన్ -16( IPL Season-16 ) ముగిసిన తరువాత డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్( WTC final match ) కోసం టీిండియా, ఇంగ్లాండ్ వెళ్ళనుంది.

జూన్ 7న లండన్ వేదికగా ఆస్ట్రేలియా- భారత్ మధ్యన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ క్రమంలో భారత జట్టులో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ కు శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) దూరం కావడంతో ఆ స్థానంలో అజింక్యా రహానే( Ajinkya Rahane ) జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన రహానే ఐపిఎల్ లో తన సత్తా చాటుతూ ఉండడంతో ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రహానే ముంబైతో జరిగిన మ్యాచ్లో 61 పరుగులు, రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 31 పరుగులతో రాణించాడు.

ప్రస్తుతం రహానే ఫామ్ లోకి రావడంతో భారత సెలక్టర్లు జాతీయ జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

కానీ శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) ను ఎంపిక చేశారు.అయితే ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి క్రీజులో నిలబడడానికే నానా తంటలు పడుతున్నాడు.ఈ సమయంలో విదేశీ పిచ్ పై అనుభవం ఉన్న రహానే అయితే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది.

ఇక సూర్య కుమార్ యాదవ్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో స్థానం దక్కే అవకాశం గల్లంతు అయినట్టే.

2022 -23 రంజి సీజన్లో రహానే ఆడిన ఏడు మ్యాచ్లలో 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి.

గత ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై చివరిసారిగా ఆడిన రహానే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు.ప్రస్తుతం రహానే ఫామ్ దృష్ట్యా మళ్లీ అతనికి బంపర్ ఆఫర్ వచ్చిందనే చెప్పాలి.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు