తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల తీవ్రమైన నిరీక్షణ తర్వాత మార్చి 9న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల పై ప్రకటన చేశాడని, ప్రకటన చేసి రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్లు తప్ప భారీ ఉద్యోగాలతో నోటిిపికేషన్లు లెవని పిడీఎస్యూ అధ్యక్ష, కార్యదర్సులు క్రాంతి, మస్తాన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి, తన మంత్రులు, పూర్తిస్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారని దీంతో మరోసారి కేసిఆర్ బాధ్యతరాహిత్యం తేటతెల్లం అయిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వల్ కమిటీ పీఆర్సీ నివేదికలో 10 జిల్లాల తెలంగాణలోనే లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాయని.
పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన 33 జిల్లాల తెలంగాణ లో ఖాళీలు మూడింతలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు.
టి.ఎస్.పి.ఎస్.సీ వన్ టైం రిజిస్ట్రేషన్ లో 25 ఐదు లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని.ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.
ఇప్పుడు భర్తీ చేస్తానన్న ఉద్యోగాలు ఏ మూలకు సరిపోవువాని అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఆనాటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క దెబ్బకు లక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రకటించాడని.
మరి నేడు తన మాటపై ఎందుకు నిలబడలేక పోతున్నాడని అన్నారు.ఖాళీగా ఉన్న ఉద్యోగాల పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని.
అన్ని ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని.ప్రభుత్వ బాధ్యత కేవలం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడమే కాదని,నూతన ఉద్యోగాల కల్పన చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఏడు తయారవుతున్న పట్టభద్రుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాల సృష్టించాలని, పరిశ్రమలు నెలకొల్పాలని, నీరుద్యోగ సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనాలని,భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ కోసం నిర్దిష్టమైన "ఉద్యోగాల క్యాలెండర్" ను ప్రతి సంవత్సరం విడుదల చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులది, నిరుద్యోగులది ప్రధానమైన పాత్ర ఉందని.
రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతున్న కొద్దీ అనేక మంది విద్యార్థులు చనిపోయారని.వారి అమరత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తట్టి లేపిందని.1200 మంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయారని.ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆనాడు జై తెలంగాణ అని నినదించారని.
రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని కలలు కన్నారని.కానీ సొంత రాష్ట్రంలో కెసిఆర్ ఏలుబడిలో విద్యార్థులు నిరుద్యోగులు నిలువునా మోసపోయారని తెలిపారు.
వందలాది మంది నిరుద్యోగ సమస్యతో మళ్లీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని.ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నదని.
ఒత్తిడి పెరిగిందని.ఇది గమనించిన కెసిఆర్ మార్చి 9న అసెంబ్లీలో ఉద్యోగాల జాతర అని ప్రకటించడని అన్నారు,నామమాత్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని.
ప్రభుత్వం ఇప్పటివరకు పోలీస్, గ్రూప్-1, టెట్ నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చిందని.పోలీస్ నోటిఫికేషన్ లలో 16వేలు, గ్రూప్-1 లో కేవలం 503 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని.
దీనికి కూడా 800నుండి 1200 రూపాయల దరఖాస్తు ఫీజును నిర్ణయించిందని తెలిపారు.ఇప్పటికే కోచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వెచ్చించిన నిరుద్యోగులకు ఈ దరఖాస్తు ఫీజు ఆర్థిక భారమే అవుతుందని.
అందుకే ప్రభుత్వం ఇచ్చే అన్ని ఉద్యోగాలకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని.దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే తిరస్కరిస్తారని టి.ఎస్.పి.ఎస్.సి చెప్తుందని మండిపడ్డారు.అంటే ఎంత వీలైతే అంతా నిరుద్యోగాన్ని వడపోసి ఉద్యోగాలకు అనర్హులు చేద్దామనే ప్రభుత్వం కుట్ర దీంట్లో దాగి ఉందని అన్నారు.
అభ్యర్థులు తమ తప్పులను సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ సౌకర్యాన్ని కల్పించాలని.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు.
ఈ అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్ లలో తమకు ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా అని ఆశపడుతున్న నిరుద్యోగులను ప్రవేటు కోచింగ్ సెంటర్ లు దోచుకుంటున్నాయని.నిరుద్యోగుల నమ్మకంతో లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయని.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు దానికి తగిన మౌలిక వసతులు కల్పించడం లేదని.వేలాది మందితో ఫంక్షన్ హాల్ లో తరగతులు నిర్వహిస్తున్నాయని.
భద్రతాపరమైన చర్యలను గాలికి వదిలేస్తున్నాయని అనుకోని సంఘటన జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు.నిరుద్యోగులను మోసం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీ చేస్తూ, సదుపాయాలు కల్పించనీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై విద్యాశాఖ తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని.
అనుమతులు లేని కోచింగ్ సెంటర్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులు,విద్యార్థుల పక్షాన ఉండాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు వారి సమస్యలు పట్టించుకోకుండా రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎన్నికలను తలపించేలా బహిరంగ సభలు జరుగుతున్నరని.
మౌలికమైన సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తున్నాయని.సమస్యలకు కారణం మీరంటే మీరే అని వాదులడుకుంటున్నాయని అన్నారు.వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించడం లేదని.
కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఉన్న నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదించి విద్యార్థి, నిరుద్యోగుల సమస్యల ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి లైబ్రరీలు ఏర్పాటు చేయాలిఏజెండాను ముందుకు తీసుకురావడం కోసం PDSU-PYL ల ఆధ్వర్యంలో మే 23న చలో ప్రగతి భవన్ నిర్వహిస్తుందని విద్యార్థులు,నిరుద్యోగులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తోందని నిరుద్యోగులు,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రకటనలో పిలుపునిచ్చారు.
Latest Khammam News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy