చైతు అఖిల్ సినిమాలు లైన్ లో ఉన్నాయి... ఆ లెగసీ కాపాడుకుంటున్నాం: సుప్రియ యార్లగడ్డ

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారిలో సుప్రియ యార్లగడ్డ( Supriya Yarlagadda ) ఒకరు.

ఈమె అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలన్నింటిని చక్కా పెట్టడమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా ఈమె బాయ్స్ హాస్టల్( Boys Hostel ) అనే సినిమాని నిర్మించారు.ఈ సినిమా ఆగస్టు 26వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో నిర్మాతగా సుప్రియ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studioes )గురించి అలాగే అక్కినేని హీరోల సినిమాల గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు మీరు భారీ బడ్జెట్ సినిమాలు చేసే అంత స్టామినా ఉన్న ఎందుకు ఇలాంటి చిన్న సినిమాలకు నిర్మాతగా మారుతున్నారు అంటూ ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఇండస్ట్రీలో చిన్న పెద్ద అనే తేడా లేదు కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తున్నారని ఈ సినిమా నాకు నచ్చడంతోనే నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నానని తెలియజేశారు.అన్నపూర్ణ స్టూడియోస్ గురించి మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని తెలిపారు.

Chaitu Akhils Movies Are On The Line We Are Preserving That Legacy Supriya Yarla
Advertisement
Chaitu Akhils Movies Are On The Line We Are Preserving That Legacy Supriya Yarla

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం ఇండస్ట్రీ హబ్ గా మారిపోయిందని సుప్రియ వెల్లడించారు.ఒకానొక సమయంలో తాతయ్య అమ్మమ్మ ఇక్కడ కూర్చుని ఈనెల ఒక సినిమా కూడా షూటింగుకు రాలేదు అంటూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ సరిపోవడం లేదు అంతగా అన్నపూర్ణ స్టూడియో డెవలప్ అయిందని ఇప్పుడు కనుక తాతయ్య ఉంటే ఎంతో ఆనందపడేవారు అని సుప్రియ వెల్లడించారు.

ఈ విధంగా అన్నపూర్ణ స్టూడియో ఇంత డెవలప్ అయ్యింది అంటే అందుకు కారణం తాతయ్య నాగార్జున( Nagarjuna ) గారు పడిన కష్టమని చెప్పాలి.

Chaitu Akhils Movies Are On The Line We Are Preserving That Legacy Supriya Yarla

ఇలా ఎంతో కష్టపడి అన్నపూర్ణ స్టూడియోకి ఎంతో మంచి పేరు తీసుకువచ్చారని మేము ఆ లెగసిని కాపాడుకుంటూ వస్తున్నామని సుప్రియ యార్లగడ్డ తెలియజేశారు.ఇకపోతే నాగార్జున 100వ సినిమాలో ఏమైనా స్పెషల్ ఉండబోతుందా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో అది ఆయనే చెబుతారు.నేను ఏదైనా చెప్పానంటే నాకు పడతాయి అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య( Nagachaitanya ) అఖిల్( Akhil ) సినిమాల గురించి ప్రస్తావన వచ్చాయి.దీంతో ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం నాగచైతన్య అఖిల్ సినిమాలన్నీ లైన్ లో ఉన్నాయని సుప్రియ యార్లగడ్డ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు