ఈ బాస్‌ నిజంగా దేవుడు : ఇది చదివిన తర్వాత ఇలాంటి బాస్‌ నాకు ఉంటే బాగుండు అనుకుంటారు

పేరున్న ప్రముఖ కంపెనీలు ఎన్నో ఉద్యోగులను అత్యంత హీనంగా చూడటంతో పాటు పావల పైసలు ఇచ్చి రూపాయి పని చేయించుకుంటూ ఉంటారు.

అత్యధిక కంపెనీల్లో ఉద్యోగుల పనికి వారికి వచ్చే సాలరీకి అస్సలు సంబంధం ఉండదు.

చిన్న చితకా కంపెనీల్లో మాత్రమే కాకుండా పేరున్న ప్రముఖ కంపెనీల్లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది.కంపెనీల్లో ఉద్యోగస్తులను అత్యంత దారుణంగా హింసించడంతో పాటు, కొందరు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటారు.

కాని ఇప్పుడు నేను చెప్పబోతున్న కంపెనీ మరియు ఆ కంపెనీ బాస్‌ మాత్రం నిజంగా దేవుడు అనుకోవాలి.

  అమెరికాలోని ఇడాహాలో గల క్రెడిట్‌ కార్డులకు సంబధించిన గ్రావిటీ పేమెంట్స్‌ సంస్థను డ్యాన్‌ ప్రైస్‌ కొనుగోలు చేయడం జరిగింది.ఆ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు అప్పటి వరకు చాలా తక్కువ ఉద్యోగంతో పని చేస్తున్నారు.వారు చేస్తున్న ఉద్యోగంకు వారు పడుతున్న కష్టంకు అస్సలు సంబంధం ఉండేది కాదు.

Advertisement

భారీగా లాభాలు వస్తున్నా కూడా పాత యాజమాన్యం వారికి మాత్రం జీతాలు పెంచలేదు.ఎప్పుడైతే డ్యాన్‌ ఆ కంపెనీని కొనుగోలు చేశాడో వెంటనే కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఏడు లక్షల రూపాయల మేరకు జీతంను పెంచడం జరిగింది.

కంపెనీ సీఈఓగా ఉన్న డ్యాన్‌ ఉద్యోగస్తుల జీతాల కంటే తన జీతం చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటాడు.గతంలో మిలియన్‌ డాలర్ల జీతంను తీసుకున్న డ్యాన్‌ ప్రస్తుతం పాతిక వేల డాలర్లను మాత్రమే తీసుకుంటున్నాడు.

ఆయన మంచితనంతో ఉద్యోగస్తుల గుండెల్లో చిరస్మరనీయంగా నిలిచి పోతాడు.ఆ కంపెనీలో ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు.

ప్రస్తుతం 28 లక్షల జీతంతో పని చేస్తున్న ఉద్యోగస్తులందరికి కూడా రాబోయే అయిదు సంవత్సరంల్లో 50 లక్షల వరకు జీతం పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

  ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేందుకు కంపెనీలో వచ్చే లాభంలో ఎక్కువ శాతం వారికి జీతాలుగా ఇవ్వాలని ముందు నుండి డ్యాన్‌ భావిస్తూ ఉంటాడు.కంపెనీ కోసం ఉద్యోగస్తులు ప్రాణం పెట్టి పని చేయడం వల్ల భారీ లాభాలు వస్తున్నాయి.ఈ కంపెనీల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్‌ను ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తారు.

Advertisement

ఇచ్చే జీతంకు తగ్గట్లుగా పని చేస్తారు.అందువల్ల డ్యాన్‌ ఎంత ఎక్కువ జీతం ఇచ్చిన అంత మొత్తంలో లాభాలు వస్తూనే ఉన్నాయి.

జీతం ఇచ్చే బాస్‌ను దేవుడు అంటూనే ఆయన కోసం ఉద్యోగస్తులు కష్టపడి పని చేసి ఆయనకు లాభాలు తెచ్చి పెడుతున్నారు.

తాజా వార్తలు