ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఝలక్!

ఒకపక్క కరోనా తో దేశాలు అన్ని అతలాకుతలం అయిపోతున్నా ఈ కామర్స్ సంస్థలు మాత్రం తమ వ్యాపారాలన్నీ వృద్ధి చేసుకుంటూనే ఉన్నాయి.

ఈ కరోనా తో కొద్దీ నెలలు ఈ సంస్థలు మూతపడినప్పటికీ ఆ తరువాత కొద్దీ కొద్దిగా తమ వ్యాపారాలను ప్రారంభించేశాయి.

ఈ క్రమంలోనే జనాలను ఆకర్షితులను చేయడం కోసం పండుగల సీజన్ సమయంలో క్రేజీ ఆఫర్స్ అందించి మరింత సేల్స్ పెంచడానికి పధకాలు వేస్తుంది.అయితే ఈ ఫ్లిప్ కార్ట్,అమెజాన్ సంస్థలకు కేంద్రం ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

గ్రేట్ ఇండియా సెల్,బిగ్ బిలియన్ డేస్ వంటి పేర్లతో ప్రత్యేక సేల్స్ ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తూ తమ సేల్స్ ను పెంచుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కల్పించుకొని ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.కస్టమర్ల ను ఆకర్షించుకోవడం కోసం వెబ్ సైట్ లో ఒక వస్తువును అమ్ముతున్నప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో తయారైంది అన్న తప్పనిసరి నిబంధనను ఈ రెండు సంస్థలు పట్టించుకోవడం లేదని కేంద్రం అభిప్రాయపడుతోంది.

ఈ క్రమంలో ఆ సంస్థల పనితీరుపై కేంద్ర సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఈ రెండు సంస్థలకే కాకుండా మరికొన్ని ఇతర సంస్థలకు కూడా కేంద్ర సర్కార్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Advertisement

ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై,యాప్ లపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొన్ని చైనా యాప్ లను భారత్ లో బ్యాన్ కూడా చేసింది కేంద్రం.

ఇలాంటి సమయంలో ఈ ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి సేల్స్ ను నిర్వహించి ఆ వస్తువు ఏ దేశంలో తయారైంది అన్న నిబంధనను కూడా మరచి ప్రవర్తిస్తుండడం పై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు