సిడిపి పనులు త్వరితగతిన చేపట్టాలి - రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల : సిడిపి పనులు త్వరితగతిన చేపట్టాలని పై కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సిడిపి పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ద్వారా పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ మొదలగు 18 ఏజేన్సీలకు కేటాయించడం జరిగిందని అన్నారు.క్షేత్రస్థాయిలో పనులు పూర్తయినప్పటికీ యూ.సీ.లు సమర్పించక పోవడం వల్ల ప్రభుత్వ రికార్డులలో పనులు పూర్తి కానట్లు ఉందని,నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారి, ఏరియా ఆసుపత్రి అధికారి, సంబంధిత అధికారులు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రస్తుత స్థితిగతుల పట్ల సంబంధిత శాఖలు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇంకా మొదలు పెట్టని పనులకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకొని వెంటనే మొదలు పెట్టాలని సూచించారు.ఈ సమీక్షలో సీపీఓ శ్రీనివాసాచారి, పీఆర్ ఈఈ భూమేష్, ఇంజనీరింగ్ అధికారులు, ఎం పి.డి.ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్...వర్కౌట్ అవుతుందా..?
Advertisement

Latest Rajanna Sircilla News