వలిగొండ నుండి రైల్వే స్టేషన్ వరకు సిసి రోడ్డు నిర్మించాలి:సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా:( Yadadri Bhuvanagiri District ) వలిగొండ మండల కేంద్రంలోని చెరువు కట్ట నుండి రైల్వే స్టేషన్ కు వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా ఉందని,వెంటనే సిసి రోడ్డు మంజూరు చేసి నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

గురువారం సిపిఎం పోరుబాటలో భాగంగా గుంతలమయమైన మట్టి రోడ్డును సిపిఎం బృందం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం వందలాది మంది వలిగొండ పట్టణానికి చెందిన రైతులు తమ పంట పోలాలకు వెళ్లడానికి,లింగరాజు పల్లి గ్రామానికి చెందిన ప్లప్రయాణికులు ప్రయాణం చేయడానికి ధాన్యం మార్కెట్లోకి తీసుకురావడానికి అనువుగా ఉన్న ఈమట్టి రోడ్డు పూర్తిగా గుంతలమయమై రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం,భువనగిరి ఎమ్మెల్యే వెంటనే స్పందించి సీసీ రోడ్డును మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కోరారు.

అదేవిధంగా వలిగొండ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,నాయకులు కొండూరు సత్తయ్య,ఎండి షహీద్,రైతులు మైసోళ్ల కిష్టయ్య,రవి,నరేందర్ లు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలకు రుణమాఫీ : మంత్రి కోమటిరెడ్డి
Advertisement

Latest Video Uploads News