Vizag Drugs : విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుకున్న సీబీఐ.. టీడీపీ నేతలపై ఆరోపణలు ? 

గత కొంతకాలంగా ఏపీలో డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతుండడం, దీనిపై రాజకీయంగాను టిడిపి, వైసిపిలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి.

దీనికి తగ్గట్లుగానే ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టు పడడం సంచలనంగా మారింది.

విశాఖ పోర్ట్ లో 25వేల కేజీల డ్రగ్స్ ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు.బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ లో ఈ భారీ డ్రగ్స్ దొరకడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసిన బ్యాగులలో డ్రగ్స్ ను తరలిస్తుండగా సిబిఐ అధికారులు మెరుపు దాడులు చేసి ఈ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు.ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు విశాఖ పోర్టు( Visakhapatnam Port )లో ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు.

ఇందులో కొకైన్ ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు.మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయి అనే విషయం పైన అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈనెల 16న విశాఖకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఈ కంటైనర్ లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగులు ఉన్నాయని, మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

బ్రెజిల్ నుంచి విశాఖలోని శాంతోస్ పోర్ట్ నుంచి బయలుదేరిన జిన్ లియాన్ యన్ గ్యాంగ్ కంటైనర్ నౌక ఈనెల 16న రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్ కు చేరుకుంది.అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్ట్ స్టాక్ యార్డ్ లో అన్లోడ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ షిప్ లోని ఎస్ఈకేయూ 4375380 నంబరు గల కంటైనర్ లో మాదిక ద్రవ్యాలు ఉన్నాయని, వీటిని తనిఖీ చేయాలని ఈనెల 18న ఇంటర్ పోల్ నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది.వెంటనే దీనిపై సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు.

ఈ వ్యవహారం పై దర్యాప్తు బాధ్యతలను డిఎస్పి ఉమేష్ శర్మకు అప్పగించారు.సిబిఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్ కుమార్ తో పాటు మరో డిఎస్పి ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్ తో ఈనెల 19న ఉదయం 8.15 గంటలకు చేరుకుంది.విశాఖ సిబిఐ డిఎస్పి సంజయ్ కుమార్ సిన్హా( Sanjay Kumar Sinha ) తో కలిసి విశాఖ పోర్ట్ విజిలెన్స్ , కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీలు చేపట్టారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇంటర్ పోల్ సమాచారం ఇచ్చిన నంబర్ గల కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ కంటైనర్ సంధ్య ఎక్స్ పోర్ట్ పేరు మీద వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

ఇప్పటికే సంధ్య ఎక్స్ పోర్ట్ కు సంబంధించిన యాజమాన్యంపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఈ కేసులో టిడిపి కి చెందిన కీలక నేతలు కొంతమంది ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ అధికారులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు.

ఈ డ్రగ్స్ సంధ్య ఆక్వా కంపెనీ ఎగుమతులు ద్వారా భారత్ కు వచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగాను సంచలనంగా మారింది.సంధ్య ఎక్స్ పోర్ట్ కంపెనీ( Sandhya exports company ) ఎండిగా కూనం వీరభద్రరావు, సీఈవోగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు.

ఇంకా టిడిపి, బిజెపి లకు చెందిన కొంతమంది కీలక నేతల బంధువుల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వస్తుండడంతో రాజకీయంగా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు