Hair Growth : ఈ మిరాకిల్ ఆయిల్ ను వారానికి రెండు సార్లు వాడారంటే జుట్టు పెరగడమే తప్ప ఊడటం ఉండదు!

సాధారణంగా చాలా మందిలో జుట్టు రాలడమే తప్ప పెరగడం అనేది ఉండదు.దీని కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతుంది.

 If You Use This Miracle Oil Will Stop Hair Fall Quickly-TeluguStop.com

దాంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.అయితే ఈ సమస్యను రివర్స్ చేసే మ్యాజికల్ ఆయిల్ ఒకటి ఉంది.

ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు కనుక వాడారంటే మీ జుట్టు పెరగడమే తప్ప రాలడం ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక లీటర్‌ కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ ఆవాలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ) వేసుకోవాలి.

అలాగే రెండు రెబ్బలు వేపాకు రెండు రెబ్బలు కరివేపాకు( curry leaves ), అర కప్పు ఉల్లిపాయ ముక్కలు మరియు ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు వేసి ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు గ‌రిటెతో తిప్పుకుంటూ ఆయిల్ ను హీట్ చెయ్యాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Miracleoil, Latest-Telugu Health

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి సున్నితంగా తలను మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

Telugu Care, Care Tips, Fall, Oil, Miracleoil, Latest-Telugu Health

ఈ ఆయిల్ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.అలాగే జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.

కాబట్టి హెయిర్ ఫాల్‌ తో సతమతం అవుతున్నవారు, హెయిర్ గ్రోత్ లేదని బాధపడుతున్న వారు కచ్చితంగా ఈ మ్యాజికల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీసం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube