కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి..: ఎంపీ లక్ష్మణ్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక తప్పులు జరిగాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును ప్లానింగ్, డిజైన్ కు విరుద్ధంగా నిర్మించారని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోందని మండిపడ్డారు.

కాళేశ్వరం అంశాన్ని కాంగ్రెస్ చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.కాళేశ్వరంపై విచారణకు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం లేదని ప్రశ్నించారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరిపై కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

కాళేశ్వరంపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు