కొందరికి చెమట ఎందుకు ఎక్కువగా పడుతుంది ?

శరీరంలోంచి చెమట రావడం మంచిదే.శరీరంలో ఉన్న మలీనాలు బయటకు వెళ్ళే మార్గాల్లో అది కూడా ఒకటి.

కాని కొందరికి చెమట అతిగా పడుతుంది.ఒక్కోసారి కారణం లేకుండా కూడా.

Why Do Some People Release Excessive Sweat From The Body ?-Why Do Some People Re

ఇలాంటి వారిని "హైపర్ హిడ్రోసిస్" బాధితులు అని అంటారు.ఇది ఆరోగ్యకరమైన కండీషన్ కాదు.

వీరు మనలాగే ఉన్నా, మనం చేసే పనే చేసినా, మనకంటే చాలా ఎక్కువగా చెమటపడుతూ ఇబ్బందిపడతారు.మరి ఈ కండిషన్ రావడానికి కారణాలు ఏంటి ? సింపాతేటిక్ నెర్వస్ సిస్టం, అవసరానికి మించి పని చేయడం వలన ఇలా జరుగుతుంది అనేది ప్రధాన కారణం.హార్మోనల్ ఇమ్బ్యాలేన్స్, జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు అనేవి మనకు తెలిసిన సాధారణ కారణాలు.

Advertisement

కాని దీని వెనుక కొన్ని అసాధారణ కారాణాలు కూడా ఉండొచ్చు.కాబట్టి, మీ స్నేహితుడికే గనుక ఇలాంటి సమస్య ఉంటే, మేం చెప్పే ఆ భయానక కారణాలు చూపించి ఓసారి పరీక్షలు చేయించుకోమని చెప్పండి.

బ్లడ్ షుగర్ లెవెల్స్ అవసరానికన్నా తక్కువ ఉంటే కూడా ఈ సమస్య రావచ్చు.ట్యుబర్ కులోసిస్ అనే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కూడా అధిక చెమటకి కారణం కావచ్చు.

ఈ సమస్యే గనుక వస్తే, కేవలమ అధికంగా చెమట పట్టడమే కాదు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు, రక్తంతో కూడిన దగ్గు, మూర్చ, ఛాతి నొప్పి కూడా కలగవచ్చు.లింఫోమా అనే మరో కారణంతో కూడా అధికంగా చెమట పట్టవచ్చు.

ఈ సమస్య వచ్చినట్లయితే పొట్ట ఉబ్బడం, శ్వాసలో ఇబ్బంది తలెత్తవచ్చు.కాబట్టి చెమటే కదా అని అలసత్వం వద్దు.

రాజేంద్ర  ప్రసాద్ గొప్ప నటుడు ఏం కాదు... దుమారం రేపుతున్న నటుడు నరేష్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు