బాలికకు తన పిల్లను పరిచయం చేసిన పిల్లి.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..

పెంపుడు జంతువులు( Pet Animals ) తమ యజమానులను ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమిస్తాయి.వారిని నమ్మినట్టు తమని తాము కూడా అవి నమ్మవు.

అంత విధేయత చూపిస్తాయి.ముఖ్యంగా కుక్కలు, పిల్లులు మనుషులకు బాగా అటాచ్ అవుతాయి.

ఇవి తమ ఓనర్లపై ప్రేమ కురిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.వాటిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది.

తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియోలో ఒక పిల్లి తల్లి( Mother Cat ) తన యజమాని కూతురికి తన పిల్లను( Kitten ) చూపించడం కనిపించింది.ఎక్స్ అకౌంట్ @Yoda4ever ఈ వీడియోను షేర్ చేసింది.ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక క్యాట్ ఒక చిన్నారి వద్దకు వెళ్లి ఆమె ఒడిలో కూర్చొని తన ప్రేమను వ్యక్తపరచడం చూడవచ్చు.

ఇంతలోనే పిల్లి తల్లి వెనుక నుంచి దాని పిల్ల బయటికి వస్తుంది.తల్లి పిల్లి తన పిల్లను చూడాలంటే ఎత్తుకోవాలంటూ సైగలతో ప్రోత్సహించింది.చిన్న పిల్లికూనను చూడగానే ఆ అమ్మాయి( Girl ) దాన్ని ఎత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకొని నిమిరింది.

షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు ఇప్పటికే కోట్లలో వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన చాలామంది సో క్యూట్ బ్యూటిఫుల్ అని కామెంట్లు పెడుతున్నారు.పిల్లి ( Cat ) ఎంత క్యూట్ గా ఉందో ఈ చిన్నారి కూడా అంతే క్యూట్ గా ఉందని మరికొందరు అంటున్నారు.

డిస్నీ ప్రిన్సెస్ అని అమ్మాయిని పొగుడుతున్నారు.ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?
Advertisement

తాజా వార్తలు