దాసరి కుమారులపై కేసు నమోదు.. మళ్ళీ ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దగా,సినిమా గురువుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకులు దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దాసరి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది.

ఇప్పటికే ఇండస్ట్రీలో దాసరినారాయణరావు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన దాసరి కుమారులు తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.

గత కొన్ని రోజుల క్రితం దాసరినారాయణరావు బ్రతికి ఉన్నప్పుడు తన దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లించాలని తన కుమారులను దాసరి స్నేహితుడు అడిగితే ఇంకొకసారి డబ్బులు అడగడానికి వస్తే చంపేస్తామంటూ అతనిని ని బెదిరించిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.

దాసరి నారాయణరావు చిన్న కుమారుడు అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.

Advertisement
Case Registered Against Dasari Arun In Banjarahills Police Station, Hyderabad P

బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెక్నీషియన్‌ దాసరి నారాయణరావు దగ్గర 2012 నుంచి 16 వరకు మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ పని చేశారు.

Case Registered Against Dasari Arun In Banjarahills Police Station, Hyderabad P

ఈ సమయంలో దాసరి కుమారులు ప్రభు అరుణ్ కూడా వెంకటేష్ కు బాగా పరిచయమే.అయితే 2018 దాసరి మరణం తర్వాత ఆయన కుమారులు పాత ఒప్పందం రద్దు చేసుకొని వెంకటేష్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు.ఇటీవల వెంకటేష్ కు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తాను ఎటువంటి పత్రాలపై సంతకాలు చేయలేదని అరుణ్ పేర్కొన్నారు.

Case Registered Against Dasari Arun In Banjarahills Police Station, Hyderabad P

ఈ డబ్బుల విషయమై అరుణ్ వెంకటేష్ ను ఈనెల 13వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎఫ్‌ఎన్‌సీసీకి రమ్మని చెప్పగా చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని ఆ సమయంలో అరుణ డబ్బులు ఇవ్వకపోగా అతని కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.అదే విధంగా తనకు అరుణ్ నుంచి ప్రాణహాని కూడా ఉందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొనడంతో దాసరి అరుణ్ పై పోలీసులు అట్రాసిటీ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు