ప్రపంచంలో సరికొత్త సంచలన గేమ్.. కార్-జిట్సు!

సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రపంచంలో ఏ మూల ఆసక్తికర విషయాలైనా మనం ఫోన్లలో చూస్తున్నాం.ఎన్నో వైరల్ వీడియోలు, ఆసక్తికర కథనాలు తెలుసుకుంటున్నాం.

తాజాగా ఓ కొత్త గేమ్ నెట్టింట బాగా వైరల్ అయింది.జియు-జిట్సు అనే గేమ్ తరహాలో కొత్తగా రూపొందిన కార్-జిట్సు గేమ్ పలువురిని ఆకర్షిస్తోంది.

రష్యాలో ఇటీవల కాలంలో ఈ గేమ్ బాగా పాపులర్ అయింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

కుస్తీ పోటీలు మీరు చూసి ఉంటే దానికి కొంచెం విశాలమైన ప్రదేశం అవసరం పడుతుంది.ఒకరిపై ఒకరు పట్టు సాధించి, అవతలి వారిని పడగొట్టడానికి సమతలమైన ప్రాంతంలో పోటీ పడతారు.

Advertisement

అయితే ఈ కార్-జిట్సులో పేరుకు తగ్గట్టే కారులోనే ఈ కుస్తీ పోటీలు ఉంటాయి.బ్రెజిలియన్ జియు-జిట్సు, జూడో బ్లాక్ బెల్ట్, ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అయిన వికెంటియ్ మిఖీవ్ కొన్ని సంవత్సరాల ఈ కొత్త గేమ్‌కు శ్రీకారం చుట్టారు.

కార్-జిట్సు గేమ్‌లో పాల్గొనే వారు తమ ప్రత్యర్థిని కారులోని చిన్న ప్రదేశంలోనే లొంగదీసుకోవాలి.ప్రత్యర్థిపై విజయం సాధించేందుకు కారులోని ఏ వస్తువునైనా ఉపయోగించుకోవచ్చు.

అయితే జియు-జిట్సు తరహాలో లాగా ఒకరిని మరొకరు కొట్టడానికి నిబంధనలు అంగీకరించవు.

కార్-జిట్సు నియమాలు ఇలా ఉంటాయి.ఇద్దరు పోటీదారులు కారు ముందు సీట్లలో ఈ పోటీని ప్రారంభిస్తారు.3 నిమిషాల వ్యవధి ఉండే రెండు రౌండ్లను నిర్వహిస్తారు.ఎక్కువ పాయింట్లు సాధించిన వారు విజేతగా నిలుస్తారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?

అయితే రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా స్కోరు సమంగా ఉంటే, పోటీదారులు నాలుగు నిమిషాల రౌండ్ కోసం వెనుక సీటుకు వెళతారు.అక్కడ కూడా బాగా పోటీ పడతారు.

Advertisement

అందులో మెరుగైన పాయింట్లు సాధించిన వారిని విజేత ప్రకటిస్తారు.ప్రస్తుతం నెట్టింట ఈ గేమ్ బాగా వైరల్ అయింది.

కారులో ఉన్నప్పుడు ఎవరైనా అగంతకులు అటాక్ చేస్తే, వారి నుంచి రక్షించుకునేందుకు ఈ గేమ్ బాగా ఉపయోగపడుతుందని దీని సృష్టికర్తలు చెబుతున్నారు.

తాజా వార్తలు