లిఫ్ట్ లో చిక్కుకుపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత..!!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు పెను ప్రమాదం తప్పింది.సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్ లో చిక్కుకుపోయారు.

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్య నందిత హాజరయ్యారు.ఈ క్రమంలో పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు.

Cantonment MLA Lasya Nandita Stuck In The Lift..!!-లిఫ్ట్ లో చ

ఆమెతో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది.అయితే ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది.

ఎంత ప్రయత్నించినప్పటికీ లిఫ్ట్ ఓపెన్ కాకపోవడంతో డోర్లు పగులగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?

తాజా వార్తలు