Canadian study visa: కెనడియన్ స్టడీ వీసాల్లో పెరుగుతోన్న తిరస్కరణ రేటు... యూకే వైపు పంజాబీల చూపు

ఏదైనా విదేశానికి చదువు, ఉపాధి నిమిత్తం వెళ్లాలంటే పంజాబీల ఫస్ట్ ఛాయిస్ ‘‘కెనడా’’నే.దశాబ్ధాల అనుబంధంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా కెనడాలోనే స్థిరపడటంతో పంజాబీ యువత చాలా మంది కెనడా వెళ్లేందుకు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు.

కాగా.కెనడియన్ విద్యార్ధి వీసాల విషయంలో తిరస్కరణ రేటు పెరుగుతూ వుండటంతో పాటు బ్యాక్‌లాగ్‌లు, తదితర కారణాలతో పంజాబీ యువత మనసు మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.వీరంతా యూకే వైపు మొగ్గుచూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.బ్రిటీష్ హైకమీషన్ లెక్కల ప్రకారం.2022 జూన్ వరకు భారతీయ విద్యార్ధులకు 1.20 లక్షల స్పాన్సర్డ్ స్టడీ వీసాలు జారీ చేయబడ్డాయి.వీటిలో 40 శాతం పంజాబీ విద్యార్ధులే కావడం గమనార్హం.

యూకేలో స్టడీ వీసా పొందాలంటే IELTS పరీక్షలో 6 మార్కులు వస్తే చాలు.ఇందులో చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం వంటివి వుంటాయి.

దీనిపై ఓ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.కెనడాలో స్టూడెంట్ వీసాల మంజూరుకు ఆలస్యం అవుతూ వుండటంతో పాటు తిరస్కరణ రేటు 50 శాతానికి పైగా చేరడంతో పంజాబీ విద్యార్ధులు యూకే వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.IELTS పరీక్షలో సులభంగా పాస్ అవ్వడం ద్వారా యూకేలో 100 శాతం వీసాలు లభిస్తాయని, దీనికి తోడు అక్కడి యూనివర్సిటీలు విద్యార్ధులకు పలు రకాలైన స్కాలర్‌షిప్‌లను అందిస్తుండటంతో విద్యార్ధులు అటుగా వెళ్తున్నారని కన్సల్టెంట్ చెప్పారు.

Advertisement

అంతేకాకుండా యూకేలోని అనేక విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యను ప్రోత్సహించడానికి భారతీయ విద్యా సంస్థలతో సంబంధాలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు