టికెట్ల హామీలతో మాజీలకు కాంగ్రెస్ గేలం ?

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్( Congress ) విశ్వ ప్రయత్నలు చేస్తుంది.ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో, పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుంటుంది.

అలాగే గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించి,  పార్టీలో సరైన ప్రాధాన్యం లేక, ఇతర పార్టీల్లో చేరిపోయిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) శ్రీకారం చుట్టారు.ఈ మేరకు పార్టీని వీడిన సీనియర్ నేతలను సంప్రదించి, వారు తిరిగి కాంగ్రెస్ లో చేరే విధంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పార్టీని వీడిన వారిని గుర్తించి , మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాబితాను పంపించాలని అన్ని జిల్లాల పార్టీ కీలక నేతలు, సీనియర్లను రేవంత్ కోరారు.గ్రామ, మండల స్థాయిలో రకరకాల కారణాలతో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లిపోయిన నాయకులతో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు జరగబోతున్నారు.

మళ్లీ కాంగ్రెస్ లో చేరితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు, సీట్లు ఇస్తామనే హామీని ఇస్తున్నారు .ఇక రాష్ట్రస్థాయిలో కీలక నేతలు గా గుర్తింపు పొంది,  టిఆర్ఎస్ బిజెపి లలో చేరిన కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే కార్యక్రమం కి శ్రీకారం చుట్టారు.ఇప్పటికే వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  ఏ మోహన్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  మహేశ్వర్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy, Maheshwar Reddy ) తదితర నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలో మరికొంతమంది సీనియర్ నాయకులు గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.వీరిలో కొంతమందికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కేటాయిస్తామనే హామీని వారి ప్రాధాన్యాన్ని బట్టి ఇస్తున్నారు.

ఈ చేరికల విషయంలో రేవంత్ రెడ్డికి పార్టీ హై కమాండ్ పూర్తిగా స్వేచ్చ కల్పించడంతో, ఘర్ వాపసి కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశారు.ఈ నెలాఖరు లేదా, జూలైలో జరిగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనను పురస్కరించుకుని, ఇతర పార్టీ లోని కొంతమంది ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావడం ద్వారా, పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని బిజెపి, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇవ్వవచ్చనే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు