డెమొక్రాట్ల అడ్డాలో ట్రంప్ .. నీలాన్ని ఎరుపెక్కిస్తానంటూ వ్యాఖ్యలు , కొత్త సర్వే ఏం చెబుతుందంటే..?

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US presidential election ) డెమొక్రాటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు తలపడనున్నారు.

వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియనప్పటికీ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

అయితే ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేలు ప్రతినిత్యం వెలువడుతూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.ఈ క్రమంలో సౌత్ బ్రోంక్స్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ఇదే సమయంలో కొత్తగా విడుదలైన పోల్‌ న్యూయార్క్‌లో బైడెన్ - ట్రంప్ మధ్య అంతరయం గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది.

అసోసియేటెడ్ ప్రెస్( Associated Press ) ప్రకారం.2020 అధ్యక్ష ఎన్నికల్లో బ్రోంక్స్‌లో ట్రంప్‌ 16 శాతం ఓట్లు మాత్రమే పొందారు.ఇదే సమయంలో బైడెన్‌కు 80 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.

Advertisement

ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు నల్ల జాతీయులు, హిస్పానిక్ ఓటర్ల మద్ధతును పొందేందుకు ట్రంప్, బైడెన్‌( Donald Trump, Joe Biden )లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.బ్రోంక్స్ జనాభాలో 65 శాతం మంది హిస్పానిక్‌లు కాగా.31 శాతం మంది నల్లజాతీయులే.న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన ట్రంప్ .బ్రోంక్స్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ తాను ఈ రాష్ట్రాన్ని గెలవగలనని ధీమా వ్యక్తం చేశారు.త్వరలోనే ఈ నీలం నగరం.

ఎరుపు రంగులోకి మారుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు.

1,191 మంది నమోదిత ఓటర్లతో మే 13 - 15 మధ్య నిర్వహించిన సియానా కాలేజీ( Siena College ) పోల్ ప్రకారం .బైడెన్‌కు 47 శాతం, ట్రంప్‌కు 38 శాతం పాయింట్లు వచ్చాయి.బైడెన్ 2020లో న్యూయార్క్‌లో 23 పాయింట్ల తేడాతో విజయం సాధించారు.

కొత్త సర్వే ప్రకారం.న్యూయార్క్‌లో బైడెన్‌కు 20 పాయింట్లు తగ్గగా, ట్రంప్‌ 2020తో పోలిస్తే ఏడు పాయింట్లను అదనంగా పొందారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఏప్రిల్, ఫిబ్రవరితో పాటు ఇటీవలి సియానా కాలేజీ సర్వేలలో ట్రంప్ ఓట్ల వాటా కొంతమేర పెరిగింది.కాగా.

Advertisement

డొనాల్డ్ ట్రంప్‌ను చూసేందుకు 25 వేల మంది ప్రజలు క్రోటోనా పార్క్‌( Crotona Park )కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ట్రంప్ రాష్ట్రంలో విజయం సాధించలేరని డెమొక్రాట్లు వాదించగా.

బ్రోంక్స్ రిపబ్లికన్ పార్టీ చైర్ రెండినో ట్రంప్ పర్యటన వారికి పంచ్ అంటూ సెటైర్లు వేశారు.

తాజా వార్తలు