డీఎన్ఏ పరీక్షల ద్వారా చిన్నారుల కెరీర్ ప్రణాళిక చేసుకోవచ్చా..?

సాధారణంగా ప్రతి చిన్నారికి ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి.

అయితే వాటిని గుర్తించి వారిని ఆ రంగంలో శిక్షణ అందించేందుకు అద్భుతాలు సృష్టించడం పెద్ద పని ఏమీ కాదు.

అయితే పిల్లలలో సామర్థ్యాలను గుర్తించి వారిని ఆయా రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడం చాలా కష్టమైన పని.ఇందుకోసం భారత అమెరికన్ వ్యాపారవేత్త మహమ్మద్ ముస్తఫా( Mohammed Mustafa ) ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.ఈ సాఫ్ట్ వేర్ పిల్లల లాలాజలం నుండి సేకరించిన జన్యువులను విశ్లేషించడం వలన వారికి అనువైన కెరీర్ ప్రణాళికను సూచిస్తుందట.

దీంతో పిల్లలకు 10-15 సంవత్సరాల వయస్సు వరకు వారికి నైపుణ్య ప్రణాళికలను సాఫ్ట్ వేర్ ద్వారా అందించగలరని వారు చెప్పారు.

ముస్తఫా రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ పిల్లల్లోని జన్యువుల విశ్లేషణ( Analysis of genes ) పై ఆధారపడి ఉంటుంది.అలాగే వారు ఎలాంటి నైపుణ్యం కలిగి ఉన్నారో గుర్తించవచ్చు.అలాగే వారికి అనువైన కెరీర్ ప్రణాళిక వేసుకునే అవకాశం ఉంది.

Advertisement

అయితే దీని ఆధారంగా సంబంధిత చిన్నారికి ప్రత్యేకమైన పాఠశాల విద్యను కూడా అందించవచ్చని, దీని వలన మెరుగైన భారతదేశాన్ని నిర్మించగలమని మొహమ్మద్ ముస్తఫా వివరించారు.అయితే పిల్లల సామర్థ్యాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవడానికి వారు పూర్తిస్థాయిలో జీన్ మ్యాపింగ్ చేశారని ముస్తఫా తెలిపారు.

భారత్ విద్యా వ్యవస్థతో( Indian education system ) పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి చిన్నారికి అన్ని బోధించడం చాలా అవసరం.అలాగే తర్వాతి దిశలో కూడా కొన్ని దేశాలు మేథో పరీక్షలు నిర్వహించి పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.వాటి ఆధారంగా చిన్నారుల కెరీర్ నిర్ణయిస్తున్నారు.

అయితే తాజాగా భారత అమెరికన్ వ్యాపారవేత్త మహమ్మద్ ముస్తఫా రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 10-15 ఏళ్ల వరకు చిన్నారుల కెరీర్ ను స్వయంగా మనమే ప్రణాళిక చేసుకునే అవకాశం రావడం గమనార్హం.అయితే ఇప్పటివరకు దీన్ని ఉపయోగించలేదు.

అయినప్పటికీ ఇది దేశాల్లోని ప్రతిభను సరైన మార్గంలో నిర్మించడంలో సహాయపడుతుందని ముస్తఫా తో పాటు పలువురు చెప్పుకొచ్చారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు