మలయాళీలు కూడా అంత అనర్గళంగా మాట్లాడలేరు.. జర్మన్ యువతి ఇరగదీసింది భయ్యా..

వేరే దేశాలకు వెళ్లినప్పుడు భాష ఒక పెద్ద అడ్డంకి.మనకు అక్కడి భాష రాకపోతే చిన్న చిన్న మాటలు కూడా చెప్పడం కష్టమైపోతుంది.

కానీ, భాష ఒక్కోసారి ఊహించని బంధాలను కూడా కలుపుతుందని ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.క్లారా అనే జర్మన్ యువతి( German Woman ) ఇండియాకి టూరిస్టుగా లేదా టెంపరరీ రెసిడెంట్ గా వచ్చింది.

ఇక్కడ క్యాబ్ డ్రైవర్‌తో మలయాళంలో( Malayalam ) మాట్లాడుతూ అందరినీ షాక్ చేసింది.ఆమె మాట్లాడే విధానం చూసి డ్రైవరే అవాక్కయ్యాడు.

వీడియోలో క్లారా( Klara ) క్యాబ్‌లో కూర్చొని డ్రైవర్‌ని మలయాళంలో పలకరించింది.ఒక విదేశీ యువతి తన మాతృభాషలో మాట్లాడటం విని డ్రైవర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

Advertisement
Cab Driver Stunned As German Tourist Speaks Fluent Malayalam Viral Video Details

"ఎప్పుడైనా మలయాళం మాట్లాడే విదేశీయుల్ని కలిశారా?" అని క్లారా అడిగితే, "లేదు" అని వెంటనే సమాధానం ఇచ్చాడు డ్రైవర్.తర్వాత ఇద్దరూ సరదాగా మలయాళంలోనే కబుర్లు చెప్పుకున్నారు.

Cab Driver Stunned As German Tourist Speaks Fluent Malayalam Viral Video Details

క్లారా ఈ వీడియోని తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.తను మలయాళం నేర్చుకుంటున్నానని తన ప్రొఫైల్‌లో రాసుకుంది."ఉబర్ డ్రైవర్లతో మలయాళంలో మాట్లాడితే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తారు.

అందుకే ఆ రియాక్షన్ ఒకసారి వీడియో తీద్దామనిపించింది" అని క్లారా చెప్పింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.

ఇప్పటికే మిలియన్ వ్యూస్ దాటేసింది.క్లారా మలయాళం మాట్లాడిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

తిరిగి సినిమాల్లోకి వస్తానంటే వద్దన్నారు.. జెనీలియా సంచలన వ్యాఖ్యలు వైరల్!
విదేశీ విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం షాక్.. దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఈ-మెయిల్స్

చాలామంది ఆమె ఫ్లూయెన్సీకి ఆశ్చర్యపోతుంటే, కొందరు మాత్రం "మాకంటే బాగా మాట్లాడుతోంది" అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Cab Driver Stunned As German Tourist Speaks Fluent Malayalam Viral Video Details
Advertisement

ఒక నెటిజన్ అయితే "నాకు అసూయగా ఉంది.నాకంటే బాగా మాట్లాడుతోంది" అని కామెంట్ చేశాడు.ఇంకొకరు "వావ్, నువ్వు ఈ భాషని ఎంత ఈజీగా నేర్చుకున్నావ్" అని మెచ్చుకున్నారు.

చాలామంది ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.ఒకాయన అయితే "మా అమ్మాయి కంటే మీ మలయాళం చాలా బాగుంది.

గర్వంగా ఉంది" అని రాశారు.మరొకరు ఫన్నీగా "నేను సైకిల్ కింద పడి చచ్చిపోవాలి.

నాకంటే నువ్వే చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతున్నావ్" అని కామెంట్ పెట్టారు.ఈ వీడియో చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.

భాషలు ప్రాంతాలను దాటి మనుషుల్ని ఎలా కలుపుతాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా.

తాజా వార్తలు