క్రెడిట్ కార్డులు ఉన్న వారికి బంపరాఫర్.. మూవీ టికెట్లు ఫ్రీగా పొందొచ్చిలా..

మీకు సినిమాలు చూడటం అంటే ఇష్టమా? అయితే, మీ కోసం ఒక శుభవార్త.మీరు మీ క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఉచితంగా సినిమాలను ఆస్వాదించవచ్చు.

సినిమా ప్రియుల కోసం, ఉచిత టిక్కెట్లు, క్యాష్‌బ్యాక్, తగ్గింపులు, ఇలాంటి ఎన్నో అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించే క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి.ముఖ్యంగా కోటక్ పీవీఆర్ గోల్డ్ క్రెడిట్ కార్డ్( PVR Gold Credit Card ) మీకు సంవత్సరంలో 24 సినిమా టిక్కెట్‌లను అందిస్తుంది.

ఈ కార్డ్‌ పొందడానికి ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ కోసం వార్షిక రుసుము చెల్లించాలి.అది రూ.499లు మాత్రమే ఉంది.మీరు ఈ కార్డ్‌ని తీసుకున్న వెంటనే, మీరు పీవీఆర్‌ షీల్డ్‌కి సంబంధించిన అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ( Kotak Mahindra Bank )సినిమా ప్రియుల కోసం ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది.పీవీఆర్ సంస్థతో కలిసి దీనిని అమలు చేస్తోంది.ఈ పీవీఆర్ కోటక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్‌తో వినియోగదారులు చాలా ప్రయోజనాలు పొందొచ్చు.మీరు నెలవారీ బిల్లింగ్ సైకిల్ సమయంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీరు ఒక ఉచిత పీవీఆర్ మూవీ టిక్కెట్‌ను పొందవచ్చు.ఉచిత పీవీఆర్ సినిమా టిక్కెట్‌లను పొందడానికి మీ పీవీఆర్ కొటక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి భారతదేశంలో ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు.

Advertisement

మీరు ఏ ప్రదర్శనకైనా, ఏ రోజుకైనా, ఎప్పుడైనా టిక్కెట్‌ పొందే వీలుంటుంది.

పీవీఆర్‌లో ఫుడ్, కూల్ డ్రింక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.పీవీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా టిక్కెట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.అయితే ఈ క్రెడిట్ కార్డుతో ఫ్రీగా మూవీ టికెట్ పొందాలంటే మాత్రం నెలకు ఈ కార్డు ద్వారా రూ.10 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.అదే సమయంలో మీరు ఈ క్రెడిట్ కార్డుతో రూ.15 వేలు ఖర్చు చేస్తే నెలకు రెండు మూవీ టికెట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది.ఇలా సంవత్సరానికి 24 టికెట్లు గరిష్టంగా పొందొచ్చు.

Advertisement

తాజా వార్తలు