లండన్‌ వీధుల్లో ఇండియన్‌ మరమరాల బిజినెస్‌.. అతడి ఆలోచనకు హ్యాట్సాప్‌

అభివృద్ది చెందిన దేశం అయిన బ్రిటన్‌లో స్నాక్స్‌ ఫుడ్‌గా బేకరీ ఐటెంమ్స్‌ను స్థానికులు ఎక్కువగా తింటూ ఉంటారు.రోడ్‌ సైడ్‌ ఫుడ్‌పై వారు ఆసక్తి చూపించరు.

అయినా రోడ్డు సైడ్‌ ఫుడ్‌ అక్కడ ఎక్కువగా ఉండదు.తాజాగా ఒక వ్యక్తి లండన్‌ వీధుల్లో ఒక బండి ఏర్పాటు చేశాడు.

ఆ బండిని స్థానికులు అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.ముఖ్యంగా ఇండియన్స్‌ అయితే ఎగబడి మరీ చూస్తున్నారు.

అందరిని అంతగా ఆశ్చర్యపర్చిన ఆయన ఏం అమ్ముతున్నాడో తెలుసా మరమరాలు.అవును ఇండియాలో బాగా ఫేమస్‌ అయిన మరమరాలను అతడు లండన్‌లో అమ్ముడున్నాడు.

Advertisement

లండన్‌కు చెందిన యాంగస్‌ దీనోస్‌ అనే ప్రొఫెషనల్‌ చెఫ్‌ తన వృత్తికి రిటైర్డ్‌ అయ్యాడు.శేష జీవితంను హాయిగా గడుపుతున్నాడు.

అలాంటి సమయంలో ఒక సారి ఆయన ఇండియాకు వచ్చాడు.ఇండియాలోని కోల్‌కత్తా నగర వీధుల్లో అమ్మబడుతున్న మరమరాల మసాలా ఝూల్మురీని తిన్నాడు.

అది అతడికి బాగా నచ్చింది.ఒక సింపుల్‌ రెసిపీ ఇంతగా రుచిగా ఉండటం ఏంటని అతడు ఆశ్చర్య పోయాడు.

ఆ తర్వాత అతడు దాన్ని గురించి లోతుగా తెలుసుకున్నాడు.ఖాళీగా ఉండటం ఎందుకనుకుని మరమరాల మసాలాను లండన్‌ వీధుల్లో అమ్మడం మొదలు పెట్టాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇండియాలో ఎలాగైతే ఝూల్మురీని తయారు చేస్తారో అచ్చు అలాగే అతడు లండన్‌లో కూడా తయారు చేసి ఇస్తున్నాడు.దాంతో స్థానికులు ఎగబడుతున్నారు.ప్రతి రోజు అయిదు వందల మంది వరకు ఇతడి వద్దకు వచ్చి మరమరాల మసాలాను కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

ఝల్మూరి ఎక్స్‌ప్రెస్‌ అంటూ ఇతడు తన బండికి పేరు పెట్టాడు.సోషల్‌ మీడియాలో కూడా దీన్ని బాగా ప్రమోట్‌ చేస్తున్న కారణంగా జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చి తన మరమరాల మసాలాను కొనుగోలు చేస్తున్నాడని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ప్రస్తుతానికి ఒకేచోట ఉన్న ఈ బండి త్వరలోనే లండన్‌లోని వీది వీధిలో ఉండే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు.ఇండియాలోనే మరమరాలకు పెద్దగా డిమాండ్‌ లేదు.అలాంటిది అక్కడ ఈ వ్యాపారం చేయాలనుకోవడం ఆయన ఆలోచనకు హ్యాట్సాప్‌ అని చెప్పాలి.

తాజా వార్తలు